రామ్ చరణ్‌కు డై హార్డ్ ఫ్యాన్‌గా ది చైన్ స్మోకర్స్.. హాట్ డ్యూడ్ అంటూ టాప్ హాలీవుడ్ సింగర్ ప్రశంసల మోత!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా భారతదేశంతో పాటు విదేశాలలో కూడా చెర్రీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఓ అంతర్జాతీయ సింగర్ చెర్రీకి ఫిదా అయిపోయాడు. ఆ సింగర్ ఎవరు? రామ్ చరణ్ గురించి ఎలాంటి కామెంట్స్ చేశాడో ఓ లుక్కేద్దాం.
ఇప్పటిదాకా ఎంతో మంది రామ్ చరణ్ గురించి గొప్పగా మాట్లాడటం చూసాము. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ సింగర్ రామ్ చరణ్ పై తన అభిమానాన్ని వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. పాపులర్ బ్యాండ్ ది చైన్ స్మోకర్స్ లలో ఒకరైన పాపులర్ సింగర్ అలెగ్జాండర్ పాల్ తాను రామ్ చరణ్ అభిమానిని అంటూ తాజాగా చెప్పుకొచ్చారు.

అంతేకాదు అతనితో కలిసి పని చేయడానికి ఇష్టపడతాను అంటూ తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ పై తనకున్న అభిమానం గురించి ఓపెన్ గా మాట్లాడాడు. తాజాగా సంగీత ద్వయం అలెగ్జాండర్ పాల్, ఆండ్రూ టాగర్ట్ రాజ్ షమనితో కలిసి యూట్యూబ్ పాడ్ కాస్ట్ లో కనిపించారు. ఈ నేపథ్యంలోనే ఏ భారతీయ స్టార్ తో కలిసి పని చేయాలనుకుంటున్నారు అనే ప్రశ్న అలెక్స్ కు ఎదురైంది.
ఆయన వెంటనే రామ్ చరణ్ అంటూ సమాధానం చెప్పాడు. RRR సినిమాలో రామ్ చరణ్ నటన, డ్యాన్స్ పై హాట్ డ్యూడ్ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. దీంతో ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు చెర్రీ పాపులారిటీ ఈ రేంజ్ లో పెరగడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అలెగ్జాండర్ కేవలం చెర్రీ గురించి మాత్రమే కాదు బాలీవుడ్ సినిమాను కూడా చూశానని చెప్పుకొచ్చారు.

ప్లేన్ లో వెళ్తున్నప్పుడు ఓసారి తన పక్కనే కూర్చున్న వ్యక్తి బాలీవుడ్ సినిమాను చూసాడని, అందులో డాన్స్, సీన్స్, కలర్స్, సినిమాటోగ్రఫీ అన్ని అద్భుతంగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. మరి ఈ అంతర్జాతీయ సింగర్ కి రాంచరణ్ సినిమాలో నటించే అవకాశం ఎప్పుడు దక్కుతుందో!?
ప్రస్తుతం చెర్రీ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో రామ్ చరణ్ పవర్ ఫుల్ పాత్రలో కన్పించనున్నాడు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు.


Click it and Unblock the Notifications











