టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్: 70 కోట్లతో నెంబర్ వన్ హీరోగా ఐకాన్ స్టార్ రికార్డ్
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న బడా హీరోల్లో మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకడు. సీనియర్ ప్రొడ్యూసర్ కొడుకుగా సినిమాల్లోకి వచ్చినప్పటికీ.. అద్భుతమైన టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. తద్వారా స్టార్ స్టేటస్‌తో పాటు ఎంతో మంది అభిమానులనూ సంపాదించుకున్నాడు. బన్నీకి తెలుగులోనే కాదు.. దక్షిణాదిలో చాలా వరకూ ఫాలోయింగ్ ఉంది. దీంతో అతడికి సంబంధించిన ప్రతి దానికి అన్ని ప్రాంతాల్లో మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. తద్వారా ఈ ఘనతను అందుకున్న ఏకైక హీరోగా నిలిచాడు. ఆ సంగతులు మీకోసం!

‘అల.. వైకుంఠపురములో’తో వచ్చాడు
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం 'అల.. వైకుంఠపురములో'. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. టబు, సుశాంత్, నివేదా, సముద్రఖని, మురళీ శర్మ కీలక పాత్రలు చేశారు. దీనికి థమన్ సంగీతం అందించాడు. హారిక హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై చినబాబు, అల్లు అరవింద్ దీన్ని నిర్మించారు.
Recommended Video

బన్నీ ఖాతాలోకి మొదటి ఇండస్ట్రీ హిట్
ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అల.. వైకుంఠపురములో' సినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇక, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. దాదాపు రూ. 130 కోట్ల షేర్‌ను అందుకుని ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఫలితంగా ఈ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎన్నో రికార్డులను అందుకుంది.

సినిమాతో పాటు అవి కూడా సక్సెస్‌గానే
'అల.. వైకుంఠపురములో' ఆల్బమ్‌కు శ్రోతల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఈ సినిమాలోని అన్ని పాటలకు భారీ స్థాయిలో క్లిక్కులు వచ్చాయి. మరీ ముఖ్యంగా యూట్యూబ్‌లో ఈ సినిమాలోని లిరికల్, వీడియో సాంగ్స్‌కు అత్యధిక వ్యూస్ రావడంతో ఎన్నో రికార్డులు కొట్టాయి. ఈ క్రమంలోనే ఈ ఆల్బమ్ 2 బిలియన్ (200 కోట్లు) వ్యూస్‌ను కూడా దాటింది.

బుట్టబొమ్మ హైలైట్... ఎందుకు అంటే?
ఈ చిత్రంలోని అన్ని పాటలకూ విశేషమైన స్పందన వస్తే.. 'బుట్ట బొమ్మ' సాంగ్ మాత్రం మరింత ఎక్కువ ఆదరణను అందుకుంది. ఇప్పటికే ఈ పాటకు ఎన్నో అవార్డులు దక్కాయి. దీనికి కారణం థమన్ కంపోజ్ చేసిన ట్యూన్స్.. అమ్రాన్ మాలిక్ గొంతు.. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ.. వీటన్నింటికీ మించి అల్లు అర్జున్ - పూజా హెగ్డే గ్రేస్ అన్న విషయం అందరికీ తెలిసిందే.

టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన బన్నీ
'బుట్ట బొమ్మ' పాట వచ్చి చాలా కాలమే అవుతోన్నా.. ఇప్పటికీ దీనికి క్లిక్కుల మీద క్లిక్కులు వస్తూనే ఉన్నాయి. ఇలా తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో 700 మిలియన్ వ్యూస్ మార్కును చేరుకుంది. తద్వారా తెలుగులో ఈ ఘనతను అందుకున్న తొలి హీరోగా బన్నీ చరిత్రను సృష్టించాడు. ఇక, ఈ పాటకు 4.4 మిలియన్ లైకులు కూడా వచ్చాయి. ఇది సౌత్‌లోనే అరుదైన రికార్డు.

సౌత్‌లో రెండో స్థానం.. ఇండియాలో 28
'అల.. వైకుంఠపురములో' చిత్రంలోని 'బుట్ట బొమ్మ' పాట 700 మిలియన్ వ్యూస్‌ను అందుకోవడం ద్వారా ఎన్నో రికార్డులు కనుమరుగైపోయాయి. మరీ ముఖ్యంగా ఈ పాట 'రౌడీ బేబీ' తర్వాత ఎక్కువ వ్యూస్ సాధించి సౌత్‌లో రెండో స్థానానికి చేరుకుంది. ఇక, ఇండియా వ్యాప్తంగా అల్లు అర్జున్ సాంగ్ 28వ స్థానంలో నిలిచినట్లు ఫిలిం నగర్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

పుష్పరాజ్‌గా మారిపోయిన అల్లు అర్జున్
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమాను చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్. ఇది రెండు భాగాలుగా విడుదల కాబోతుంది. అందులో మొదటి దాన్ని డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. అల్లు అర్జున్ ఇందులో గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











