twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిద్ కి సంగీతం అవసరం లేదు... అతనే సంగీతమన్న బన్నీ.. ఆ లాజిక్ తీసి ట్రోలింగ్!

    |

    అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో', 'పుష్ప' సినిమాల్లో యువ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ పాడిన పాటలు ఎంతగానో ట్రెండింగ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు సిద్ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించని బన్నీ.. తాజాగా సోషల్ మీడియా వేదికగా అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ వివరాల్లోకి వెళితే

    ఫిదా అయిపోయా

    ఫిదా అయిపోయా

    అల్లు అర్జున్ తన కొత్త సినిమా పుష్ప సూపర్ హిట్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఈ సినిమా పాటలు కూడా అంతటా హిట్ అయ్యాయి, ముఖ్యంగా శ్రీవల్లి పాట హిందీ మరియు తెలుగు రెండింటిలోనూ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. తెలుగులో, ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడారు మరియు చాలా కాలం తర్వాత పుష్ప అల్లు అర్జున్ తన పోస్ట్ ద్వారా ఎటువంటి ఆర్కెస్ట్రా లేకుండా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సిద్ శ్రీరామ్ 'శ్రీవల్లి'ని పాడిన తీరుకు ఫిదా అయిపోయానని పేర్కొన్నాడు. అంతేకాక "అతనికి సంగీతం అవసరం లేదు... అతనే సంగీతం" అని కూడా చెప్పాడు.

     సంగీతంతో పనిలేదు.. అతనే సంగీతం

    సంగీతంతో పనిలేదు.. అతనే సంగీతం

    ఈ మేరకు అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఓ లేఖను విడుదల చేశారు. ''కాస్త తీరిగ్గా ఉన్నప్పుడు ఇది చెప్పాలనుకున్నాను. 'పుష్ప' ప్రీ రిలీజ్ వేడుకలో నా సోదరుడు సిధ్ శ్రీరామ్ 'శ్రీవల్లి' పాటను పాడారు. ఎటువంటి సంగీత వాయిద్యాలు లేకుండా అతను పాటను స్టార్ట్ చేశారు. నేనింకా నిదానంగా అతని పాటకి వెనుక సంగీతం మొదలు పెడతారేమో అని వేచి చూస్తున్నా. కానీ, సంగీతం మొదలు కాలేదు. ఎటువంటి సంగీతం లేకుండా.. పాటను పాడుతూ ఉన్నారు. ఆశ్చర్యపోయా. నాకది అద్భుతంగా అనిపించింది. అతనికి సంగీతంతో పనిలేదు.. అతనే సంగీతం'' అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.

     కొద్దిగా భిన్నంగా

    కొద్దిగా భిన్నంగా

    ఇక దీనిపై స్పందించిన సిధ్ శ్రీరామ్.. ఇది నిజమైన గౌరవంగా భావిస్తున్నాను అని చెబుతూనే బన్నీకి థ్యాంక్స్ చెప్పారు. ఇంకా మరెన్నో మంచి పాటలు బన్నీ కోసం పాడేందుకు వేచి చూస్తున్నాను అని కూడా తెలిపారు. అయితే అంతా బాగానే ఉన్నా ఇప్పుడు ట్రోలర్లు సిద్ శ్రీరామ్‌ను ట్రోల్ చేస్తున్నారు. అదేమంటే సిద్ శ్రీరామ్ అమెరికాలో పెరిగిన తమిళ గాయకుడు. కాబట్టి, అతని తమిళ, తెలుగు యాస కొద్దిగా భిన్నంగా ఉంటుంది.

     మళ్ళీ వెలుగులోకి

    మళ్ళీ వెలుగులోకి

    అతను తెలుగు సాహిత్యాన్ని ఉచ్చరించే విధానం తెలుగు ప్రేక్షకులు సహా కొంతమంది తెలుగు సంగీత దర్శకులు కూడా విమర్శిస్తూ ఉంటారు. పుష్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో, సిద్ కొన్ని పదాలు తప్పుగా పలకడంతో అప్పట్లో ట్రోల్ చేశారు. కానీ అప్పట్లో ఆ విషయం పెద్దగా హైలైట్ అవ్వలేదు. అందరూ ఆసంగతే మరిచిపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ మరోసారి ఆ టాపిక్ బయటకు తీసుకురావడంతో, సిద్ చేసిన తప్పులు ప్రస్తవిస్తూ పలువురు ట్రోల్ చేస్తున్నారు

    అల్లు అర్జున్ ని కూడా

    అల్లు అర్జున్ ని కూడా

    మరో వైపు, సిద్‌ను ప్రశంసించినందుకు అల్లు అర్జున్‌ను సైతం ట్రోల్ చేస్తున్నారు. తెలుగు నేటివిటీ పదాలను ఎప్పుడూ తప్పుగా ఉచ్చరించే వారిని ఇలా ఎలా ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితేనేమి కళకు భాషా అడ్డంకులు లేవని చెబుతుంటారు పెద్దలు. సో ఈ విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవనవసరం లేదని కొందరు అంటున్నారు.

    English summary
    Allu arjun praises Singer sid sriram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X