For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పుష్ప నుంచి మరో అదిరిపోయే అప్డేట్.. ఈసారి రంగంలోకి రష్మిక కూడా..

  |

  అల వైకుంఠపురములో మూవీతో కెరీర్ లోనే భారీ సక్సెస్ తో పాటు హీరోగా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడం ఖాయమని తెలుస్తోంది. పుష్ప పై బన్నీ మరింతగా శ్రద్ధ పెట్టినట్లు సమాచారం. ఈ ,మూవీ కోసం నెవర్ బిఫోర్ అనేలా ఫుల్ గా క్రాఫ్, గడ్డం పెంచిన అల్లు అర్జున్ ఫిట్నెస్ విషయంలో కూడా బాగా కష్టపడి కసరత్తులు చేయాల్సి వచ్చింది.

  మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ పుష్ప ది రైజ్ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ టైం అల్లు అర్జున్ కి జోడీగా యువ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమాకి లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.

  ఇక ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, అలానే దాక్కో దాక్కో మేక సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ దక్కించుకోవడంతో పాటు ఆడియన్స్ లో మూవీ పై మంచి హైప్ క్రియేట్ చేసాయి అనే చెప్పాలి. దాక్కో దాక్కో మేక సాంగ్ అయితే విడుదలైన ఐదు భాషల్లో కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. చాలా గ్యాప్ తరువాత అల్లు అర్జున్, సుకుమార్ ల జోడీ నుండి వస్తున్న మూవీ కావడంతో అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా పుష్పపై విపరీతంగా అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో కమర్షియల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు సమాచారం.

  Allu arjun Pushpa another big surprise with second song

  ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ గా అలానే రష్మిక మందన్న ఒక గిరిజన తెగకు చెందిన యువతిగా కనిపించనుంది. ప్రముఖ మలయాళ యాక్టర్ ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కన్నడ నటుడు ధనుంజయ కూడా ఒక నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడు. యాంకర్ అనసూయ కూడా ఒక కీలక రోల్ లో కనిపంచనుందని ఇటీవల క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ త్వరలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోందట. లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం ఈ సాంగ్ వినాయకచవితి సందర్భంగా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

  ఇక ఈ సాంగ్ అల్లు అర్జున్, రష్మిక ల మధ్య వచ్చే రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ అని తెలుస్తోంది. కాగా సినిమాలో మొత్తం ఐదు సాంగ్స్ కి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించారని, అలానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మరొక రేంజ్ లో ఉండనుందని టాక్. మొత్తంగా అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ పుష్ప మూవీ విడుదల తరువాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

  English summary
  Allu arjun Pushpa another big surprise with second song..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X