Pushpa మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్: ఆ సూపర్ హిట్ సాంగ్ వీడియో విడుదల

'అల.. వైకుంఠపురములో' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత టాలీవుడ్ బడా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం 'పుష్ప'. ప్రేమకథా చిత్రాలకు పెట్టింది పేరైన సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు. 'ఆర్య', 'ఆర్య 2' వంటి ఫీల్ గుడ్ మూవీల తర్వాత వీళ్లిద్దరూ కలిసి ఇప్పుడు మాస్ మసాలా కథతో వచ్చారు. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం మొదటి పార్ట్ 'పుష్ప.. ద రైజ్'ను డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో వచ్చిన ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే స్పందన వస్తున్న విషయం తెలిసిందే.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'పుష్ప' మూవీతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లోని థియేటర్లు మొత్తం ప్రేక్షకుల రాకతో కళకళలాడిపోయాయి. ఇక, ఈ సినిమా అల్లు అర్జున్ 'వన్ మ్యాన్ షో' అని అంటున్నారు. అలాగే, ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌లు, దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ హైలైట్‌గా ఉన్నాయని అంటున్నారు. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు కూడా భారీగా వస్తున్నాయి. దీంతో అతడి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు చిత్ర యూనిట్ అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తోంది.

Allu Arjuns Pushpa Daakko Daakko Meka Full Video Song Released

మాస్ ఎలిమెంట్స్‌తో గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో వచ్చిన 'పుష్ప' మూవీ నుంచి ఇటీవలే మేకింగ్ వీడియోను విడుదల చేశారు. అలాగే, కొన్ని డైలాగ్ ప్రోమోలతో పాటు సాంగ్ కట్‌లు కూడా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాలోని సూపర్ డూపర్ హిట్ సాంగ్ 'దాక్కో దాక్కో మేక' ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఇది రిలీజ్ అయిన కొద్ది సమయంలోనే అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ పాట అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దీంతో యూట్యూబ్‌లోనూ మంచి వ్యూస్, లైకులు అందుకుంటూ దూసుకుపోతోంది.

'పుష్ప' మూవీ నుంచి మొదటి పాటగా వచ్చి రికార్డులు క్రియేట్ చేసిన 'దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుతుంది పీక' పాటను దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు. చంద్రబోస్ రాసిన ఈ పాటను విశాల్ దద్లానీ (హిందీ), విజయ్ ప్రకాశ్ (కన్నడ), రాహుల్ నంబియార్ (మలయాళం), శివమ్ (తెలుగు), బెన్నీ దయాల్ (తమిళం)లు పాడారు. విడుదలైన అన్ని భాషల్లోనూ దీనికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా తెలుగులో ఈ సాంగ్ సెన్సేషన్ అయిపోయింది. దీంతో ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. ఇప్పుడు వీడియో సాంగ్‌ను కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేశారు.

'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్‌ పుష్ప రాజ్‌గా నటించాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసలు చేశాడు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, సునీల్ ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించారు. అలాగే, సమంత స్పెషల్ సాంగ్ చేసింది. ఇక, ఈ సినిమా ఇప్పటికే రూ. 250 కోట్ల గ్రాస్‌ను అందుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X