Pushpa: ఇది నా అడ్డా అంటున్న అల్లు అర్జున్.. షాకింగ్ లుక్‌తో సర్‌ప్రైజ్ చేశాడుగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలోని హీరోలు అందరూ పాన్ ఇండియా మార్కెట్‌పై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే తమ స్టామినాను దేశ వ్యాప్తంగా చూపించుకునేందుకు ఇక్కడి స్టార్లంతా భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దీంతో కొందరు పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిపోయారు. ఈ క్రమంలోనే మరికొందరు అదే బాటలో పయనిస్తున్నారు. అలాంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకడు. గత ఏడాది 'అల.. వైకుంఠపురములో' మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అతడు.. ఇప్పుడు 'పుష్ప' అనే భారీ చిత్రంలో నటిస్తున్నాడు.

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రమే 'పుష్ప'. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతుంది. దీంతో దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. అందులో మొదటి దాన్ని 'పుష్ప.. ద రైజ్' పేరిట ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. హై రేంజ్‌లో రాబోతున్న 'పుష్ప' మూవీపై దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలూ దృష్టి సారించాయి. మాస్ యాక్షన్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

 Allu Arjuns Pushpa Fourth Single on November 19th

అల్లు అర్జున్ నటిస్తోన్న మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో 'పుష్ప'ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన చాలా వరకు షూటింగ్ పూర్తైంది. అలాగే, రెండో పార్ట్‌ కోసం దాదాపు 40 శాతం చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు ఈ మూవీ బ్యాలెన్స్ పార్ట్ కోసం షూట్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని కూడా ప్రకటించారు. దీంతో ప్రమోషన్ కార్యర్రమాలను కూడా కొద్ది రోజుల క్రితమే మొదలెట్టారు. ఇలా ఇప్పటికే ఎన్నో పోస్టర్లు, టీజర్‌ సహా పలు అప్‌డేట్లు ఇచ్చారు. అన్నీ ప్రేక్షకుల మన్ననలు పొందాయి.

'పుష్ప' మూవీ నుంచి గతంలో 'దాక్కో దాక్కో మేక' అనే పాట విడుదలైంది. దీనికి దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఆ తర్వాత ఈ మూవీ నుంచి 'శ్రీవల్లి' అని సాగే ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు. దీనికి కూడా అన్ని భాషల్లో మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే 'సామీ సామీ' అంటూ సాగే మాస్ బీట్‌ను కూడా వదిలారు. ఇక, ఇప్పుడు ఈ సినిమా నుంచి 'ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా' అనే మాస్ సాంగ్‌ను నవంబర్ 19న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను వదిలింది. ఇందులో అల్లు అర్జున్ మాస్ అండ్ స్టైలిష్ లుక్‌తో కనిపించి షాకిచ్చాడు.

అల్లు అర్జున్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రాబోతున్న 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసలు చేస్తున్నాడు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది. దీన్ని డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X