For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pushpa: అల్లు అర్జున్ ఖాతాలో అరుదైన రికార్డు.. ఈ సారి తెలుగులో కాదు తమిళంలో!

  |

  బడా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ టాలీవుడ్‌లో చాలా కాలంగా బడా హీరోగా వెలుగొందుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రెండేళ్ల క్రితం వచ్చిన 'అల.. వైకుంఠపురములో' సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్న ఈ స్టార్ హీరో.. ఆ వెంటనే పాన్ ఇండియాపై ఫోకస్ చేశాడు. ఇందులో భాగంగానే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి 'పుష్ప' అనే సినిమాను చేశాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా.. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందింది.

  ప్యాంటు విప్పేసి షాకిచ్చిన ప్రగ్యా జైస్వాల్: పైన కూడా ఓ రేంజ్‌లో.. వామ్మో ఇది మరీ ఘోరం!

  అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' మూవీ రెండు భాగాలుగా రూపొందిన విషయం తెలిసిందే. ఇందులో మొదటి పార్ట్ 'పుష్ప ద రైజ్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరంభం నుంచే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రం.. పాన్ ఇండియా రేంజ్‌లో మంచి బిజినెస్‌ను కూడా జరుపుకుంది. మొత్తంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ చేసుకుంది. దీంతో రూ. 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఇక, ఈ సినిమా మంచి రెస్పాన్స్‌తో ఆరు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 178.46 కోట్లు వసూలు చేసింది. అంటే దీనికి రూ. 32 కోట్లు పైగా లాభాలు కూడా వచ్చాయి.

  Allu Arjuns Pushpa Saami Saami Tamil Lyrical Song Got 100 Million Views

  ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పుష్ప' మూవీకే కాదు.. దీని నుంచి ఏది విడుదలైన భారీ స్థాయిలో స్పందన వచ్చిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలకు అన్ని భాషల్లోనూ అద్బుతమైన ఆదరణ దక్కింది. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులు కూడా నమోదు అయ్యాయి. దీంతో గత ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్‌గా ఇది పేరు తెచ్చుకుంది. అంతేకాదు, ఇందులో 'సామీ సామీ' పాట అయితే సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. ఇందులో హీరోయిన్ రష్మిక మందన్నా స్టెప్పులకు కూడా విశేషమైన రెస్పాన్స్ దక్కింది. దీంతో అన్ని భాషల్లో ఇది హిట్ అయింది.

  బాడీ పార్టులన్నీ చూపిస్తూ అనన్య నాగళ్ల అరాచకం: తెలుగమ్మాయిని ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!

  'పుష్ప' మూవీలోని సామీ సామీ పాట అన్ని భాషల్లోనూ అదరగొట్టేసిందని ముందే చెప్పుకున్నాం. ఇక, తాజాగా ఈ లిరికల్ సాంగ్ అరుదైన రికార్డును నమోదు చేసింది. అయితే, ఇది తెలుగులో మాత్రం కాదు.. తమిళంలో. అవును.. సామీ సామీ తమిళ సాంగ్ తాజాగా వంద మిలియన్ వ్యూస్ మార్కును దాటేసింది. అంతేకాదు, ఇది ఇప్పటికే అక్కడ ఒక మిలియన్ లైకులను కూడా సొంతం చేసుకుంది. దీంతో తమిళంలోనూ పుష్పరాజ్ రికార్డును క్రియేట్ చేశాడు. ఇక, ఈ పాటను దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేయగా.. వివేకా లిరిక్స్ అందించారు. రాజ్యలక్ష్మీ సెంథిగణేష్ దీన్ని అద్భుతంగా ఆలపించారు.

  Allu Arjuns Pushpa Saami Saami Tamil Lyrical Song Got 100 Million Views

  క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, సునీల్ ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించారు. అలాగే, స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.

  English summary
  Allu Arjun Did Pushpa Under Creative Director Sukumar Direction. Saami Saami Tamil Lyrical Song Got 100 Million Views.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion