అల.. వైకుంఠపురములో ఫస్ట్ సాంగ్.. నిను చూసి ఆగగలనా..! అంటూ మెస్మరైజ్ చేసేశారు
అల్లు అర్జున్- త్రివిక్రమ్ మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారు. వీరి కాంబోలో రాబోతున్న 'అల.. వైకుంఠపురములో' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నారు. 'సామజవరగమన' అంటూ సాగిపోయే ఈ మెలోడీ సాంగ్ లిరికల్ వీడియోను కొద్ది సేపటి క్రితం సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
ఒక రోజు ముందుగానే 'సామజవరగమన' సాంగ్ తాలూకు 20 సెకనుల సాంగ్ రిలీజ్ చేసి ఆసక్తి రేపిన 'అల.. వైకుంఠపురములో' తాజాగా ఫుల్ లిరికల్ వీడియోతో అలరించింది. 'నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు.. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు.. నీ కళ్లకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు..నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు'అంటూ సీతారామ శాస్త్రి రాసిన లిరిక్స్ మెలోడీ ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి.

ఇక సిద్ శ్రీరామ్ ఆలాపన, తమన్ కట్టిన బాణీలు ఈ పాటకు ప్రాణం పోశాయి. ఎంతో వినసొంపుగా ఉన్న ఈ పాట విడుదలైన కాసేపట్లోనే నెట్టింట సెన్సేషన్‌గా మారింది. వినసొంపైన పదజాలం, అందుకు తగ్గ బాణీలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి. బన్నీ, పూజా హెగ్డేకు సంబంధించిన కొన్ని క్లిప్స్ చూపించడంతో.. ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న ఆతృత రెట్టింపయింది బన్నీ అభిమానుల్లో.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై ఇటు త్రివిక్రమ్ అభిమానులు, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











