Eyy Bidda Idhi Naa Adda Lyrical: మాస్ స్టెప్పులతో రచ్చ చేసిన బన్నీ.. పాటలో ఇది గమనించారా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొద్ది రోజులుగా భారీ భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందులోనూ చాలా ఎక్కువ మూవీలు పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్నాయి. అలాంటి వాటిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'పుష్ప' ఒకటి. నల్లమల నేపథ్యంతో గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతుంది. దీంతో దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. అందులో మొదటి దాన్ని 'పుష్ప.. ద రైజ్' పేరిట ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'పుష్ప' మూవీపై దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలూ దృష్టి సారించాయి. మాస్ యాక్షన్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి వచ్చిన వీడియోలు, పోస్టర్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఇటీవలే విడుదలైన 'దాక్కో దాక్కో మేక', 'శ్రీ వల్లీ' సాంగ్స్‌కు ఓ రేంజ్‌లో స్పందన వచ్చింది. ఫలితంగా ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. అదే సమయంలో ఇప్పటి వరకూ ఉన్న అంచనాలు కూడా ఒక్కసారిగా రెట్టింపు అయిపోయాయి.

Allu Arjuns Pushpa Eyy Bidda Idhi Naa Adda Lyrical Song Released

'పుష్ప.. ద రైజ్'ను డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో దీని నుంచి తాజాగా ఐదో పాటను కూడా విడుదల చేశారు. 'ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా' అంటూ సాగే ఈ సాంగ్‌ను దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేయగా.. నకాశ్ అజీజ్ ఆలపించారు. అలాగే, దీనికి చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఆద్యంతం మాస్ నెంబర్‌తో సాగే ఈ పాటలో అల్లు అర్జున్ స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరీ ముఖ్యంగా అతడు గూని ఉన్న వ్యక్తిగా ఈ పాటలోనూ కనిపించాడు. అలాగే, పాటలో డ్యాన్స్ కూడా చేశాడు. ఇక, ఈ పాట విజువల్స్ ఎంతో రిచ్‌గా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇది శ్రోతలను ఆకట్టుకుంటోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో 'పుష్ప'ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన చాలా వరకు షూటింగ్ పూర్తైంది. అలాగే, రెండో పార్ట్‌ కోసం దాదాపు 40 శాతం చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు ఈ మూవీ బ్యాలెన్స్ పార్ట్ కోసం షూట్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని కూడా ప్రకటించారు. దీంతో ప్రమోషన్ కార్యర్రమాలను కూడా కొద్ది రోజుల క్రితమే మొదలెట్టారు.

'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసలు చేస్తున్నాడు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇందులో కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X