Pushpa మూవీ నుంచి మరో కానుక: రష్మిక గ్లామర్ ట్రీట్ ఇచ్చిన వీడియో విడుదల
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న బడా హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకడు. 2020లో సంక్రాంతికి 'అల.. వైకుంఠపురములో' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కెరీర్‌లోనే మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమాను చేశాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా.. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కింది. అంతేకాదు, రెండు భాగాలుగా రూపొందింది. ఇందులో మొదటి పార్ట్ 'పుష్ప ద రైజ్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'పుష్ప' మూవీతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లోని థియేటర్లు మొత్తం ప్రేక్షకుల రాకతో కళకళలాడిపోయాయి. ఇక, ఈ సినిమా అల్లు అర్జున్ 'వన్ మ్యాన్ షో'గా మారిపోయింది. దీంతో అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా.. రూ. 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఇక, ఈ సినిమా మంచి రెస్పాన్స్‌తో మూడు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 161.92 కోట్లు వసూలు చేసింది. అంటే దీనికి రూ. 15.92 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.

గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో వచ్చిన 'పుష్ప' మూవీ నుంచి ఇటీవలే మేకింగ్ వీడియోను విడుదల చేశారు. అలాగే, కొన్ని డైలాగ్ ప్రోమోలతో పాటు సాంగ్ కట్‌లు కూడా ఒక్కొక్కటిగా వదులుతున్నారు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితమే ఈ సినిమాలోని సూపర్ డూపర్ హిట్ సాంగ్ 'దాక్కో దాక్కో మేక' ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఇది రిలీజ్ అయిన కొద్ది సమయంలోనే అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ పాట అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇక, ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో పాటను కూడా విడుదల చేశారు.
'పుష్ప' మూవీలో 'సామీ సామీ' అంటూ సాగే మాస్ బీట్ సాంగ్‌కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఇందులో రష్మిక మందన్నా గ్లామర్ ట్రీట్ అదిరిపోయింది. అంతేకాదు, ఆమె వేసిన స్టెప్పులు కూడా సిగ్నేచర్ మూమెంట్లలా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా నుంచి ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌ను మౌనిక యాదవ్ అదిరిపోయేలా ఆలపించారు. దీనికి చంద్రబోస్ లిరిక్స్ అందించాడు. ఇక, తాజాగా వచ్చిన వీడియో సాంగ్‌కు సైతం భారీ స్పందన వస్తోంది. దీంతో ఇది కూడా వైరల్ అయిపోయింది.
'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్ పుష్ప రాజ్‌గా నటించాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, సునీల్ ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించారు. అలాగే, స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ చేసింది.


Click it and Unblock the Notifications











