Saami Saami Song: మాస్‌తో ఇరగొట్టిన మౌనిక, డీఎస్పీ.. అందాల ఆరబోతలో రష్మిక తగ్గేదేలే

గత ఏడాది సంక్రాంతికి 'అల.. వైకుంఠపురములో' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కెరీర్‌లోనే మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమాను పట్టాలెక్కించేశాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతుంది. దీంతో దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. అందులో మొదటి దాన్ని 'పుష్ప.. ద రైజ్' పేరిట ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

హై రేంజ్‌లో రాబోతున్న 'పుష్ప' మూవీపై దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలూ దృష్టి సారించాయి. మాస్ యాక్షన్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన చాలా వరకు షూటింగ్ పూర్తైంది. అలాగే, రెండో పార్ట్‌ కోసం దాదాపు 30 శాతం చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు ఈ మూవీ బ్యాలెన్స్ పార్ట్ కోసం షూట్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని కూడా ప్రకటించారు. దీంతో ప్రమోషన్ కార్యర్రమాలను కూడా కొద్ది రోజుల క్రితమే మొదలెట్టారు.

Allu Arjuns Pushpa Saami Saami Lyrical Song Released

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'పుష్ప' మూవీ నుంచి గతంలో 'దాక్కో దాక్కో మేక' అనే పాట విడుదలైన విషయం తెలిసిందే. దీనికి దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈ మూవీ నుంచి 'శ్రీవల్లి' అని సాగే ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు. దీనికి కూడా అన్ని భాషల్లో మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు దీని నుంచి మరో పాట కూడా రిలీజ్ అయింది. 'సామీ సామీ' అంటూ సాగే మాస్ బీట్‌ను కొద్ది సేపటి క్రితమే చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది.

పుష్పరాజ్ మీద మనసు పడిన శ్రీవల్లి.. అతడిపై ఉన్న ప్రేమను వ్యక్త పరుస్తూ పాడుకున్నదే 'సామీ సామీ' పాట. ఇందులో హీరోపై ఆమె ఎంతగా ఇష్టాన్ని పెంచుకుందో పాట రూపంలో అద్భుతంగా చూపించారు. ఇక, దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌ను మౌనిక యాదవ్ అదిరిపోయేలా ఆలపించారు. దీనికి చంద్రబోస్ అందించిన లిరిక్స్ ప్రధాన బలం అని చెప్పొచ్చు. అలాగే, ఇందులో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక, ఈ సాంగ్‌లో రష్మిక మందన్నా కనిపించిన తీరుకు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అంతలా ఆమె ఇందులో అందాల విందు చేసింది. మొత్తంగా ఈ పాట అన్ని వర్గాల వాళ్లనూ ఆకట్టుకుంటోంది.

అల్లు అర్జున్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రాబోతున్న 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసలు చేస్తున్నాడు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది. దీన్ని డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X