Srivalli Hindi: చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్.. ప్రపంచంలోనే మొదటి స్థానంలో పుష్ప
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న బడా హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకడు. సుదీర్ఘ కాలంగా సినిమాలు చేస్తున్నా.. 2020లో సంక్రాంతికి 'అల.. వైకుంఠపురములో' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కెరీర్‌లోనే మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమాలో నటించాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా.. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిన విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' మూవీ రెండు భాగాలుగా విడుదల అవుతుంది. ఇందులో మొదటి పార్ట్ 'పుష్ప ద రైజ్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లోని థియేటర్లు మొత్తం ప్రేక్షకుల రాకతో కళకళలాడిపోయాయి. దీంతో అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా.. రూ. 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఇక, ఈ సినిమా మంచి రెస్పాన్స్‌తో ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ. 178.46 కోట్లు వసూలు చేసింది. అంటే దీనికి రూ. 32 కోట్లు పైగా లాభాలు కూడా వచ్చాయి.

సినిమా విడుదలైన తర్వాత 'పుష్ప' మూవీ నుంచి ఇటీవలే మేకింగ్ వీడియోను విడుదల చేశారు. అలాగే, కొన్ని డైలాగ్ ప్రోమోలతో పాటు సాంగ్ కట్‌లు కూడా ఒక్కొక్కటిగా వదులుతున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాలోని సూపర్ డూపర్ హిట్ సాంగ్‌లను ఒక్కొక్కటిగా వదులుతున్నారు. అన్ని భాషల్లోనూ ఈ పాటలను రిలీజ్ చేస్తుండగా.. హిందీలో మాత్రం భారీ రెస్పాన్స్ దక్కుతోంది. మరీ ముఖ్యంగా ఇందులోని 'శ్రీవల్లి' పాట రిలీజ్ అయిన కొద్ది సమయంలోనే అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ పాట అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
తెలుగులో 'శ్రీవల్లి' పాటకు ఇప్పటి వరకూ 27 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే, టీ సిరీస్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదలైన హిందీ వెర్షన్ సాంగ్‌కు మాత్రం ఏకంగా 118 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతేకాదు, అక్కడ ఈ పాటకు 2.3 మిలియన్ లైకులు కూడా సొంతం అయ్యాయి. దీంతో ఇది చాలా రోజులుగా ట్రెండింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇది అరుదైన ఘనతను అందుకుంది. జనవరి 26వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి జనవరి 27వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకూ ప్రపంచంలోనే ఎక్కువ మంది వీక్షించిన పాటగా శ్రీవల్లి హిందీ వీడియో నిలిచింది. దీంతో ఇది అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్ పుష్ప రాజ్‌గా నటించాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, సునీల్ ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించారు. అలాగే, స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ చేసింది.


Click it and Unblock the Notifications











