Pushpa 2: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన పుష్ప టీమ్.. సాంగ్ రిలీజ్ టైమ్ మార్పు

తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాంటి వాటిలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలయిక ఒకటి. గతంలో వీళ్ల కాంబోలో ఎన్నో సూపర్ డూపర్ హిట్లు మూవీలు వచ్చాయి. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితమే 'పుష్ప ది రైజ్' అనే సినిమా చేశారు. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.

ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు సుకుమార్ - అల్లు అర్జున్ కలిసి 'పుష్ప ది రూల్' సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇండియా మొత్తాన్నే షేక్ చేసిన మూవీకి సీక్వెల్‌గా వస్తున్న దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ చిత్రాన్ని తీస్తున్నారు. దీంతో దీనిపై హైప్ పెరుగుతూనే వెళ్తోంది.

Allu Arjun Starrer Pushpa The Rule Movie First Song Release Time Changed

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ రూపొందిస్తోన్న 'పుష్ప ది రూల్' సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎంతో జోష్‌తో జరుపుతోంది. ఇలా ఇప్పటికే చాలా వరకూ టాకీ పార్టును కూడా పూర్తి చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయబోతున్నారు. ఇలా ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

సక్సెస్‌ఫుల్ కాంబోలో రూపొందుతోన్న 'పుష్ప ది రూల్' మూవీ నుంచి అప్‌డేట్ల కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే టీజర్‌ను కూడా వదిలారు. ఇది కూడా సూపర్ సక్సెస్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేయబోతున్నారు.

అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో రాబోతున్న 'పుష్ప ది రూల్' మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ను మే 1వ తేదీన ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, ఇప్పుడు ట్విస్ట్ ఇస్తూ దీన్ని సాయంత్రం 5.04 గంటలకు మార్చింది. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు. ఇక, ఈ పాటను ఏకంగా ఆరు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్‌ - సుకుమార్ కలిసి చేస్తున్న 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X