Pushpa 2: పుష్ప నుంచి కపుల్ సాంగ్ వచ్చేసింది.. ఆ స్టెప్ భలే ఉంది మాస్టారు!
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ పేరే ఎక్కువగా వినిపించేది. కానీ, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. హిందీ చిత్రాల కంటే దక్షిణాది భాషల సినిమాలు బాగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అందులోనూ తెలుగు చిత్రాలు సత్తా చాటుతున్నాయి. అలా పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ అయిన సినిమాల్లో 'పుష్ప ది రైజ్' ఒకటి అని తెలిసిందే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'పుష్ప ది రైజ్'. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలన విజయాన్ని అందుకుంది. అలాగే, ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో దీనికి సీక్వెల్‌గా 'పుష్ప ది రూల్' మూవీని తీస్తున్నట్లు ప్రకటించారు. అంతే.. ఈ చిత్రంపై అప్పటి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి.

ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'పుష్ప ది రూల్' సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎంతో జోష్‌తో జరుపుతోంది. ఇలా ఇప్పటికే చాలా వరకూ టాకీ పార్టును కూడా పూర్తి చేసేశారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయనున్నారు. ఇలా ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసేశారు.
'పుష్ప ది రూల్' మూవీ నుంచి అప్‌డేట్ల కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. అలాగే, ఇటీవలే టీజర్‌తో పాటు ఓ పాటను కూడా వదిలారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రం నుంచి 'సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ' అంటూ సాగే సెకెండ్ సాంగ్‌ను విడుదల చేశారు.
'పుష్ప ది రూల్' మూవీ నుంచి తాజాగా విడుదలైన కపుల్ సాంగ్‌ను చంద్రబోస్ రాశారు. దీన్ని దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేయగా.. శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఈ పాటకు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారు. ఈ లిరికల్ వీడియోలో ప్రాక్టీస్ సెషన్ విజువల్స్‌ను మాత్రమే చూపించారు. అయినప్పటికీ ఇది ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఇందులో హుక్ స్టెప్ అదిరేలా ఉంది. మొత్తానికి ఈ పాట కూడా అన్ని వర్గాలను మెప్పిస్తుందని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ - సుకుమార్ కలిసి చేస్తున్న 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











