Pushpa 2: పుష్ప నుంచి కపుల్ సర్‌ప్రైజ్.. అగ్గిరవ్వ మాదిరి అంటూ!

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన చిత్రాలకు మన భాషలో కంటే వేరే చోట్ల అదిరిపోయే స్పందన లభిస్తోంది. అలాంటి సినిమాల్లో 'పుష్ప ది రైజ్' మూవీ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలన విజయాన్ని అందుకుంది. అలాగే, ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.

పుష్ప సిరీస్‌లో ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు సుకుమార్ - అల్లు అర్జున్ కలిసి 'పుష్ప ది రూల్' సినిమాను చేస్తున్నారు. ఇండియా మొత్తాన్నే షేక్ చేసిన మూవీకి సీక్వెల్‌గా వస్తుండడంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ చిత్రాన్ని ఏ విభాగాల్లోనూ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు.

Allu Arjun Starrer Pushpa The Rule Movie Second Song Release on May 29th

గంథపు చెక్కల స్మగ్గింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న 'పుష్ప ది రూల్' సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎంతో జోష్‌తో జరుపుతోంది. ఇలా ఇప్పటికే చాలా వరకూ టాకీ పార్టును కూడా పూర్తి చేసేశారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయనున్నారు. ఇలా ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'పుష్ప ది రూల్' మూవీ నుంచి అప్‌డేట్ల కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. అలాగే, ఇటీవలే టీజర్‌తో పాటు ఓ పాటను కూడా వదిలారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రం నుంచి సెకెండ్ సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు.

అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో రాబోతున్న 'పుష్ప ది రూల్' మూవీ నుంచి సెకెండ్ సాంగ్‌ను మే 29వ తేదీన ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఇందులో రష్మిక 'సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉన్నడే' అనే పాట పాడుతున్నట్లు చూపించారు. దీంతో దీనిపై హైప్ పెరుగుతోంది.

ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్‌ - సుకుమార్ కలిసి చేస్తున్న 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X