Pushpa First Single Announcement: దాక్కో దాక్కో మేక.. పుష్ప రాజ్ వచ్చేస్తున్నాడు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో పాన్ ఇండియా రేంజ్‌లో ఇది రూపొందుతోంది. పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం 'పుష్ప' టీజర్‌ను విడుదల చేసిన యూనిట్.. ఇప్పుడు ఇందులోని మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఈరోజు (ఆగస్టు 2) మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని 'పుష్ప' సినిమాలోని మొదటి పాటకు సంబంధించిన ప్రకటన చేసింది చిత్ర యూనిట్. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. అందులో డీఎస్పీ ఒకటి నుంచి ఐదు వరకూ కౌంట్ చేయగానే.. విశాల్ దద్లానీ (హిందీ), విజయ్ ప్రకాశ్ (కన్నడ), రాహుల్ నంబియార్ 'మలయాళం), శివమ్ (తెలుగు), బెన్నీ దయాల్ (తమిళం)లు దర్శనమిచ్చారు. వీళ్లంతా కలసి ఆయా భాషల్లో ఈ పాటను పాడబోతున్నారు. మొదటి పాట కోసం అందరూ సిద్ధంగా ఉండండి అంటూ అలెర్ట్ చేశారు.

తెలుగులో 'దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొడుతుంది పీక' అంటూ సాగే లిరిక్స్‌ను వినిపించారు. గంభీరమైన గొంతుతో వచ్చిన ఈ సాంగ్ ఆరంభంలోనే అదరగొట్టేసింది. దీంతో ఈ పాటపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక, ఈ మాస్ బీట్ ఆగస్టు 13న విడుదల కాబోతున్నట్లు కూడా చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక, ఇందులో అల్లు అర్జున్‌ను ఎలా చూపించబోతున్నారో ఊహించుకుంటేనే గూస్‌బమ్స్ వచ్చేలా ఉన్నాయి.

Allu Arjuns Pushpa Movie DaakkoDaakkoMeka Song Will Be Release On August 13th

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్‌ పుష్పరాజ్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం అతడు ఎన్నో సాహసాలు సైతం చేస్తున్నాడు. అలాగే డీ గ్లామర్ లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. అనసూయ కీలక పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X