Srivalli Song: అదరగొట్టేసిన సిద్ శ్రీరామ్.. స్పెషల్ అట్రాక్షన్‌గా అల్లు అర్జున్ స్టెప్పులు

గత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అల.. వైకుంఠపురములో' మూవీతో కెరీర్‌లోనే మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమాను మొదలు పెట్టేశాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతుంది. దీన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. అందులో మొదటి దాన్ని 'పుష్ప.. ద రైజ్' పేరిట ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

భారీ రేంజ్‌లో రాబోతున్న 'పుష్ప' మూవీపై అన్ని ఇండస్ట్రీలూ దృష్టి సారించాయి. మాస్ యాక్షన్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన 90 శాతం షూటింగ్ పూర్తైంది. అలాగే, రెండో పార్ట్‌ కోసం దాదాపు 30 శాతం చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు ఈ మూవీ బ్యాలెన్స్ పార్ట్ కోసం షూట్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని కూడా ప్రకటించారు. దీంతో ప్రమోషన్ కార్యర్రమాలను కూడా ఇప్పటికే ప్రారంభించేశారు.

Allu Arjuns Pushpa Srivalli Song Released

'పుష్ప' మూవీ నుంచి గతంలో 'దాక్కో దాక్కో మేక' అనే పాట విడుదలైన విషయం తెలిసిందే. దీనికి దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఇప్పుడీ మూవీ నుంచి 'శ్రీవల్లి' అని సాగే ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటను యంగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఆలపించాడు. అలాగే, ఈ సాంగ్‌కు చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ అందించారు. ఇది ఆత్యంతం ఆకట్టుకునేలా ఉంది. మరీ ముఖ్యంగా ఈ పాటకు సిద్ తన గాత్రంతో ప్రాణం పోస్తే.. అల్లు అర్జున్ అదిరిపోయే స్టెప్పులు వేసి మైమరపించాడు. మొత్తంగా ఇది తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేస్తోంది.

ఎవరికీ తల వంచని పుష్ప రాజ్.. అమ్మాయి కోసం ఆమె ఇంటి చుట్టే తిరిగే నేపథ్యంతో ఈ పాట పుట్టింది. చంద్రబోస్ అందించిన లిరిక్స్ దీన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఇక, ఇందులో చూపించిన విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి. మొత్తంగా ఈ పాటతో సినిమాపై అంచనాలు మరోసారి పెంచేసింది 'పుష్ప' టీమ్. ఇక, ఇందులోనే ఇలా ఉంటే థియేటర్లలో ఈ సాంగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అల్లు అర్జున్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రాబోతున్న 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసలు చేస్తున్నాడు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే, వర్ష బొల్లమ్మ కూడా నటిస్తున్నట్లు ఇటీవలే ఓ న్యూస్ తెగ వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X