మోహన్ బాబు 'సన్ ఆఫ్ ఇండియా' మొదటి సాంగ్.. అమితాబ్ బచ్చన్ స్పెషల్ ట్వీట్!
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న మంచు మోహన్ బాబు చాలా కాలం తరువాత మరొక డిఫరెంట్ సినిమాతో సిద్ధమవుతున్నాడు. మోహన్ బాబును యాంగ్రీ అండ్ పవర్ఫుల్ పాత్రలో చూసి చాలా కాలమయ్యింది. ఇక సన్ ఆఫ్ ఇండియాలో మంచి మెస్సేజ్ మాత్రమే కాకుండా మోహన్ బాబు అభిమానులకు నచ్చే విధంగా మంచి ఎంటర్టైన్మెంట్ ను కూడా ఉంటుందట.
ఇక నేడు సినిమాకు సంబంధించిన మొదటి లిరికల్ పాటను విడుదల చేశారు. ఇళయరాజా సంగీతం అంధించగా రాహుల్ నంబియర్ పాటను ఆలపించారు. శ్రీరాముడికి అంకితం ఇచ్చేలా ఈ పాటను కంపోజ్ చేసినట్లు వివరణ ఇచ్చారు. ఇక పాటను రిలీజ్ చేస్తూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.

ఇండియన్ సినిమాకు గొప్పవాళ్ళైన మోహన్ బాబు, ఇళయరాజా కాంబినేషన్ లో శ్రీరాముడి గొప్పతనాన్ని చాటి చెప్పేలే రఘువీర గాధ్యం పాటను కంపోజ్ చేశారు. సన్ ఆఫ్ ఇండియా సినిమాకు నా బెస్ట్ విషెస్ అంటూ.. తెలుగులో శుభాకాంక్షలు అని కూడా పేర్కొన్నారు. దీంతో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమా టీజర్ ను గత కొన్ని రోజుకు క్రితం మెగాస్టార్ చిరంజీవి ద్వారా విడుదల చేయించిన విషయం తెలిసిందే. దానికి మెగాస్టార్ కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడంతో మంచి క్రియేట్ చేసింది


Click it and Unblock the Notifications











