హిందూ దేవుడి పేరు ఉందని మ్యూజిక్ డైరెక్టర్ నో చెప్పాడు: అనంత శ్రీరామ్
ప్రముఖ తెలుగు లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ ఇటీవల ఓ షోలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయింది. ఓ సంగీత దర్శకుడిని ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడు వృత్తిని అవమానించే విధంగా మాట్లాడారని, అందుకే అతడితో కలిసి పని చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
అనంతర శ్రీరామ్ ఇటీవల అలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను రాసిన ఓ పాటలో కేవలం ఓ హిందూ దేవుడి పేరు ఉందని ఓ సంగీత దర్శకుడు ఈ పాట చేయను అన్నాడు. అతడు అలా అనడం వృత్తికి అవమానం అనిపించింది. అలా వృత్తికి గౌరవం ఇవ్వని ఇవ్వని వ్యక్తితో పని చేకూడదని నిర్ణయించుకన్నట్లు తెలిపారు.

అయితే అతడి పేరు చెప్పేందుకు అనంత శ్రీరామ్ ఇష్టపడలేదు. నేను అతడి పేరు చెప్పడం వల్ల ఆ సంగీత దర్శకుడి మార్కెట్ దెబ్బతీసినవాడిని అవుతానో, పెంచినవాడిని అవుతానో తెలియదు కానీ వృత్తిపరమైన దెబ్బ తగలకూడదను కాబట్టి ఆ పేరు చెప్పాలనుకోవడం లేదన్నారు.
ఏదో ఒకరోజు అతడే ఆ తప్పు తెలుసుకుని ఆయనే వచ్చి సారీ చెబుతారులే అని అలీ వ్యాఖ్యానించగా... నాకు సారీ కూడా అక్కర్లేదని, అతడి వృత్తిలో అతడు చల్లగా ఉండాలి, మా వృత్తిలో మేము చల్లగా ఉండాలి. అంతకు మించి నేను ఏమీ కోరుకోవడం లేదు అన్నారు.


Click it and Unblock the Notifications











