యాంకర్ మంజూషను ఆడుకొన్న జేడీ చక్రవర్తి.. ఆమె ఒక్కటివ్వదు.. ఆ రెండు అంటూ!
సంగీత కళాకారులను ప్రోత్సహిస్తూ నివృతి వైబ్స్ సంస్థ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకొనే ప్రయత్నంచేస్తున్నది. గత రెండేళ్లలో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో నివృతి సంస్థ 50కి పైగా మ్యూజిక్ వీడియో సాంగ్స్‌ను అందించింది. వీటిలో జరీ జరీ పంచెకట్టి, గుంగులు, సిలక ముక్కుదానా, జంజీరే, వద్దన్నా గుండెల్లో సేరి వంటి పాటలు అద్బుతమైన స్పందనను కూడగట్టుకొన్నాయి.
వీజే జయతి రూపొందించిన మ్యూజిక్ ఆల్బమ్నా నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..' అనే పాటను వర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఈ ఈ ప్రెస్ మీట్‌లో యాంకర్ మంజూష, జడీ చకవ్రర్తి మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా సాగింది. ఈ కార్యక్రమం జరిగినంత సేపు మంజూషపై జేడీ చక్రవర్తి వేసిన పంచుల వివరాల్లోకి వెళితే..
మంజూష భుజంపై చేయి వేసి: జేడీ చక్రవర్తిని వేదికపైకి ఆహ్వానించగానే.. మంజూషపై మంచి పంచ్ విసిరారు. తనకు ఫ్లవర్ బోకేను ఇవ్వడానికి వచ్చిన అమ్మాయిని వద్దని చెప్పి.. మంజూషను పిలిచి తన భుజంపై చేయి వేశాడు. ఫ్లవర్ బోకే కంటే.. పూల బుట్టలా ఉన్న అమ్మాయి చుట్టూ చేయి వేసి.. తద్వారా వచ్చే సువాసనల కంటే ఏమి కావాలి. బోకే కంటే.. అందమైన పువ్వు లాంటి మంజూష ఉంటే చాలు అని జేడీ చక్రవర్తి అన్నారు.

పెళ్లిలో పెళ్లి కొడుకు అంటూ: నివృత్తి సంస్థ యజమాని జయతిపై జేడీ చక్రవర్తి ప్రశంసల వర్షం కురిపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నివృతి అంటే సంతోషం అని అర్థం. జయతి గ్యాప్ తీసుకోవడం వల్లే ఈ పాట చేయగలిగింది. పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని కాకుండా.. డ్యాన్స్ చేస్తున్న జయతిని చూడటమే విశేషం. ఆమె మ్యూజిక్ ప్రతిభ గురించినాకు బాగా తెలుసు అని అన్నారు.

పెళ్లిలో జరిగే లొల్లి గురించి: మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, గేయ రచయిత కాసర్ల శ్యాంలకు పెళ్లి అయింది కాబట్టి అంత కసిగా కొట్టారు. ఈ పాట పెద్ద హిట్ అయి.. పెళ్లి జరిగితే అయ్యే లొల్లి ఏంటో పార్ట్ 2గా తీయాలని కోరుకుంటున్నాను. ఒక్క పాట కోసం ఇంతగా ఖర్చు పెడతారా? అని అనుకున్నాను. ఖర్చు పెడితే కూడా డబ్బులు వెనక్కి వస్తాయని వారి లాజిక్. ఇక్కడకు నన్ను పిలిచినందుకు నివృతి వైబ్స్‌కు థాంక్స్ అని జేడీ చక్రవర్తి అన్నారు.

నా పెళ్లికే నేను వెళ్లను అంటూ: అయితే జేడీ చక్రవర్తి స్పీచ్ ముగిసిన తర్వాత బుల్లితెర నటుడు అమర్ దీప్‌ను యాంకర్ మంజూష ఆహ్వానిస్తూ ఆహ్వానించింది. అయితే ఆయన రాకపోవడంతో.. జేడీని కదలిస్తూ.. నీవు ఎప్పుడైనా నీ ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి డ్యాన్స్ చేశావా? అని ప్రశ్నించింది. నా పెళ్లికే నేను వెళ్లను. వేరే వాళ్ల పెళ్లికి డ్యాన్స్ చేస్తానా అని జేడీ సెటైర్ వేశారు. రెండు స్పీకర్లు ఇవ్వడంతో నాకు ఒక్కటిచ్చి మంజూష సంతృప్తి చెందదు. ఎప్పుడు రెండు ఇస్తుంటుంది అని జేడీ అన్నారు.

మంజూషతో కలిసి డ్యాన్స్ చేస్తా: దాంతో అనుదీప్ ఎవరో నాకు తెలియదు. ఆయన వచ్చే వరకు టైంపాస్ చేయాలని మంజూష ప్లాన్ చేసింది. దీనిని టీపీఎస్ అంటారు.. టైంపాస్ చేసేందుకు నన్ను డ్యాన్స్ చేయమంటున్నది. కానీ మళ్లీ మరో పాట చేసినప్పుడు నేను, మంజూష కలిసి డ్యాన్స్ చేస్తాం. ప్రస్తుతం జయతి చేసిన పనికి ఆమె క్రెడిట్ పొందనివ్వండి. మరో పాట చేసినప్పుడు తప్పకుండా మంజూష, నేను కలిసి డ్యాన్స్ చేస్తాం అని అన్నాడు.


Click it and Unblock the Notifications











