Crazy Uncles Title Song: ఊపు ఊపేసిన శ్రీముఖి.. అంకుల్స్‌తో కలిసి రచ్చ

చాలా కాలంగా బుల్లితెరపై తనదైన శైలి యాంకరింగ్‌తో సందడి చేస్తూ స్టార్ హోస్టుగా వెలుగొందుతోంది లోకల్ బ్యూటీ శ్రీముఖి. యాంకర్‌గా ఫేమస్ అయిన ఈమె ముందుగా సినిమాల్లోనే నటించింది. తన కెరీర్‌లో కొన్ని చిత్రాల్లో మాత్రమే నటించి ఆ తర్వాత యాంకరింగ్‌పై దృష్టి సారించింది. ఈ కారణంగానే సినీ రంగానికి దూరంగా ఉంటూ వస్తోంది. దీంతో ఆమె అభిమానులు నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘ విరామం తర్వాత శ్రీముఖి ఓ సినిమాలో నటించింది. అదే 'క్రేజీ అంకుల్స్'. ఫన్ రైడ్‌గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ తాజాగా విడుదలైంది.

ఈ సత్తిబాబు దర్శకత్వంలో శ్రీముఖి, సింగర్ మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమే 'క్రేజీ అంకుల్స్'. ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కొద్ది సేపటి క్రితమే విడుదల చేశాడు. రఘు కుంచే కంపోజ్ చేసిన ఈ సాంగ్‌ను లిప్సిక ఆలపించింది. ఇక, దీనికి కాసర్ల శ్యామ్ అదిరిపోయే లిరిక్స్ రాశారు. సత్య మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఫాస్ట్ బీట్‌తో హస్కీ వాయిస్‌తో సాగిన ఈ సాంగ్‌లో శ్రీముఖి అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంది. ఫలితంగా పాట మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ఈ సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Anchor Sreemukhis Crazy Uncles Title Song Released

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'క్రేజీ అంకుల్స్' మూవీలో శ్రీముఖి ఫీమేల్ లీడ్‌గా నటిస్తోంది. స్పైసీగా పాత్రను చేస్తోన్న ఆమెను పడేయడం కోసం ముగ్గురు అంకుల్స్ ఎలాంటి ప్రయత్నాలు చేశారన్న పాయింట్‌తో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్‌పై కిరణ్ కే తలసిల సమర్పణలో గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ నిర్మిస్తున్నారు. ఇందులో పోసాని కృష్ణ మురళి, రఘు, హేమ, గాయత్రి భార్గవి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X