Animal: మరో చరిత్ర సృష్టించిన యానిమల్.. ఇండియాలోనే ఫస్ట్ మూవీగా రికార్డు
ప్రతి ఇండస్ట్రీ నుంచి ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే దేశ వ్యాప్తంగా సంచలనంగా మారి.. భారీ విజయాలను సొంతం చేసుకుంటాయి. అలాంటి వాటిలో గత ఏడాది చివర్లో విడుదలైన 'యానిమల్' మూవీ ఒకటి. ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా.. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీసిన సినిమానే 'యానిమల్'. యాక్షన్ అండ్ ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన ఈ మూవీపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుక తగ్గట్లుగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అనుకున్నట్లుగానే ఈ మూవీకి మంచి టాక్ రావడంతో రెస్పాన్ కూడా దక్కింది.

క్రేజీ కాన్సెప్టుతో తెరకెక్కించిన 'యానిమల్' మూవీకి ఇండియాలో మంచి స్పందన లభించింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం భారీగానే రాణించింది. ఫలితంగా ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 900 కోట్లుకు పైగా గ్రాస్‌ను, రూ. 550 కోట్లకు పైగా నెట్ వసూళ్లను రాబట్టి సత్తా చాటుకుంది. తద్వారా ఈ సినిమా ఎన్నో రికార్డులను సైతం ఖాతాలో వేసుకుందని తెలిసిందే.
పూర్తి స్థాయి యాక్షన్ అండ్ ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన 'యానిమల్' మూవీ ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లోనూ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇందులో కూడా ఇది రికార్డు స్థాయి వ్యూస్‌ను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా స్పాటిఫై (Spotify) అనే మ్యూజిక్ ప్లాట్‌ఫాంలో సైతం అదిరిపోయే రికార్డును సొంతం చేసుకుని చరిత్రను సృష్టించింది.

'యానిమల్' మూవీకి సంబంధించిన ఆల్బమ్‌ను స్పాటిఫై (Spotify)లో అందుబాటులో ఉంచారు. అందులో ఈ చిత్రం పాటలకు 500 మిలియన్ స్ట్రీమ్స్ వచ్చాయి. తద్వారా ఇండియాలో వేగంగా ఈ మార్కును చేరుకున్న తొలి చిత్రంగా 'యానిమల్' సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని సదరు సంస్థ తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. 'యానిమల్' మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, త్రిప్తి డిమ్రి కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











