అజ్ఞాతవాసి తరువాత.. అనిరుద్ రెండో సినిమా ఖరారు!
తమిళ సంగీత సంచలం అనిరుద్ రవిచంద్రన్ తెలుగులో రెండో సినిమా ఖరారైంది. నేచురల్స్ స్టార్ నాని నటించబోతున్న క్రికెట్ చిత్రం జెర్సీకి అనిరుద్ సంగీత అందించబోతున్నాడు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే అనిరుద్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.
ఈ ఏడాది ఆరంభంలో అనిరుద్ సంగీత అందించిన తొలి తెలుగు చిత్రం అజ్ఞాతవాసి విడుదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నిరాశ పరిచింది. ఆ తరువాత అనిరుద్ ఎన్టీఆర్ చిత్రానికి సంగీత అందించాల్సి ఉన్న అనుకోని కారణాలవలన అది జరగలేదు.

ఎట్టకేలకు అనిరుద్ తెలుగులో మరో చిత్రానికి సంగీత అందించబోతున్నాడు. జెర్సీ చిత్రం క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కబోతోంది. నాని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అనిరుద్ ఈ ప్రకటన చేశాడు. ఈ రోజుతో నాని ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. ఇది అద్భుతమైన జర్నీ. నాని నటించబోయే జెర్సీ చిత్రానికి సంగీతం అందించనుండడం సంతోషంగా ఉందని ట్విట్టర్లో అనిరుధ్ ప్రకటించాడు.


Click it and Unblock the Notifications











