థమన్ ను డామినేట్ చేసే విధంగా టాలీవుడ్ పై అనిరుధ్ ఫోకస్.. స్టార్ హీరోలతో వరుస సినిమాలు?

ఇటీవల కాలంలో మ్యూజిక్ డైరెక్టర్లలో ఎక్కువగా థమన్ పాటలు వైరల్ గా మారుతున్నాయి. మొన్నటివరకు దేవిశ్రీప్రసాద్ ఎవరూ ఊహించని విధంగా వరుస విజయాలతో ఇండస్ట్రీలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ ఒకటి రెండు సినిమాలతో మెప్పిస్తూ మళ్లీ మాయమవుతున్నారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ కూడా సుకుమార్ కాంపౌండ్ సినిమాలకు తప్పితే మిగతా సినిమాలకు పెద్దగా అనుకున్నంత స్థాయిలో మ్యూజిక్ ఇవ్వడం లేదు అనే కామెంట్స్ ఇంకా అదే తరహాలో కంటిన్యూ అవుతున్నాయి. అయితే సంగీత దర్శకుడు తమన్ మాత్రం ఎలాంటి సినిమాకు వర్క్ చేసినా కూడా ఊహించని విధంగా క్రేజ్ అందుకుంటున్నాడు.

Recommended Video

Tollywood పై Anirudh ఫోకస్..SS Thaman ను డామినేట్ చేసే విధంగా | Filmibeat Telugu

కేవలం పాటలతోనే కాకుండా అతనికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో కూడా ఆదరగొట్టేస్తున్నాడు. ఒక విధంగా థమన్ తన స్టైల్ ను పూర్తి గా మార్చేశాడు అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం అతను మిగతా సంగీత దర్శకుల కంటే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈ సమయంలో థమన్ కు పోటీగా తెలుగులో డామినేట్ చేసే విధంగా తమిళం సంగీత దర్శకుడు అనిరుధ్ అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. అనిరుద్ ఇదివరకే తెలుగులో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి అలాగే నాని జెర్సీ సినిమా సంగీతం అందించాడు పవన్ కళ్యాణ్ సినిమా జెర్సీ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ ఇంకా అతనికి తెలుగులో బిగ్ హిట్ రావాల్సి ఉంది.

Anirudh Ravichander focus on tollywood back to back movies with stars

అనిరుద్ రవిచంద్రన్ ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లోనే అత్యధికంగా పారితోషికం అందుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకడు. ప్రస్తుతం అక్కడ రజనీ కాంత్, విజయ్, కమల్ హాసన్ ఇలా చాలామంది స్టార్ హీరోలు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు కూడా. ప్రస్తుతం అజిత్ కూడా అథానిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు అనిరుద్ తెలుగులో కూడా బిజీ అవ్వాలని చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతను జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న న్యూ సినిమాకు ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది.

అంతే కాకుండా విజయ్ దేవరకొండ సమంత సినిమాలకు కూడా మ్యూజిక్ అందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కబొయే సినిమాకు కూడా అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ చిరంజీవి ఇలా అగ్రహీరోలతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ తరుణంలో లో అనిరుద్.. రామ్ చరణ్ జూనియర్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ.. ఇలా వరుసగా స్టార్ టాలెంటెడ్ హీరోలతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ సినిమాలు సక్సెస్ అయితే గనుక రాబోయే రోజుల్లో అనిరుద్ రవిచంద్రన్ తెలుగులో కూడా బిజీ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ కూడా వరుసగా సినిమాలను లైన్లో పెడుతుండగా త్వరలోనే ఆయనతో కూడా అనిరుద్ రవిచంద్రన్ వర్క్ చేసే అవకాశం ఉంటుంది అని ఇండస్ట్రీలో మరొక టాక్ నిపిస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో కాలమే సమాధానం చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X