కోలీవుడ్‌లో టాప్ అతడే.. 2020లో దుమ్ములేపిన అనిరుధ్!!
కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సెషన్ అనిరుధ్ రవిచందర్ తన ట్యూన్స్‌తో ఊపు ఊపేస్తున్నాడు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ తన సంగీతంతో అభిమానులను సంపాదించుకున్నాడు. తెలుగులో గ్యాంగ్ లీడర్, జెర్సీ వంటి సూపర్ హిట్ ఆల్బమ్‌లను అందించాడు. కోలీవుడ్ సూపర్ స్టార్స్ చిత్రాలకు అనిరుధ్ మాత్రమే సంగీతం అందిస్తుంటాడు. రజనీకాంత్, విజయ్ సినిమాలకు ఇప్పుడు అనిరుద్ సరి కొత్త సంగీతాన్ని అందిస్తూ అలరిస్తున్నాడు.
ఈ ఏడాది అనిరుధ్ మాస్టర్ సినిమాతో కోలీవుడ్‌ను షేక్ చేసేశాడు. కుట్టి స్టోరీ అంటూ తమిళ నాట పాపులర్ అయ్యారు. అంతకు ముందు దర్భార్ సినిమాతో రజనీకాంత్‌కు సూపర్ హిట్ మ్యూజిక్ అందించాడు. సీనియర్ హీరోలకు, యంగ్ హీరోలకు అదిరిపోయే బీట్లు కొడుతూ కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాడు. తాజాగా అనిరుధ్ ఖాతాలో సూపర్ డూపర్ రికార్డ్ వచ్చి పడింది. ఈ ఏడాది మొత్తంలో ఎక్కువ మంది విన్న పాటల్లో అనిరుధ్ ఆల్బమ్స్ టాప్‌లో ఉన్నాయి.

జియో సావన్, గానా, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ వంటి పాటల యాప్స్‌లో అనిరుధ్ పాటలే టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. మొత్తంగా అనిరుధ్ పాటలను 124.9మిలియన్లు, సిద్ శ్రీరామ్ 78.1మి, ఏఆర్ రెహ్మాన్ 77.6మి, యువన్ శంకర్ రాజా 49.4మిలియన్ల మంది విన్నారు. అలా మొత్తానికి అనిరుధ్ మాత్రం అందరి కంటే ముందు వరుసలో ఉండి తన సత్తాను చాటుకున్నాడు. ఇక వచ్చే ఏడాది కూడా అనిరుధ్ ఇలాగే తన ప్రభంజనాన్ని కొనసాగిస్తాడేమో చూడాలి.


Click it and Unblock the Notifications











