వకీల్ సాబ్ నుంచి మరో సర్ ప్రైజ్ సిద్ధం చేసిన థమన్
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూ మూవీ వకీల్ సాబ్ కోసం అభిమానులు ఏ స్థాయిలో వేయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అందుకోవాలని పవన్ కంటే ఎక్కువగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు అయితే భారీ స్థాయిలో ఉన్నాయి.
సినిమా బిజినెస్ 100కోట్లకు తక్కువ ఉండదని టాక్ కూడా గట్టిగానే వస్తోంది. అయితే సినిమాకు సంబంధించిన మరోక సాంగ్ తో అంచనాల డోస్ ను మరింత పెంచాలని చూస్తున్నారు. ఇప్పటికే మగువ మగువ సాంగ్ కు భారీ స్థాయిలో క్రేజ్ దక్కిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు 'కంటి పాప కంటి పాప' అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.

మార్చ్ 17న 5గంటలకు కొత్త సాంగ్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేయబోతున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయగా దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఇక సినిమాను ఏప్రిల్ 9న విడుదల చేయబోతున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా శృతి హాసన్ నటించగా నివేత థామస్ ముఖ్యమైన పాత్రలో నటించింది.


Click it and Unblock the Notifications











