Radhe Shyam: ప్రభాస్ నుంచి మరో సర్‌ప్రైజ్ రెడీ.. వాటన్నింటికీ మించే ట్రీట్
'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తర్వాత రెబెల్ స్టార్ ప్రభాస్ రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. దీంతో గతంలో కంటే వేగంగా సినిమాల మీద సినిమాలు లైన్‌లో పెట్టుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే చాలా రోజుల క్రితమే 'రాధే శ్యామ్' అనే రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీని మొదలు పెట్టాడు. 'జిల్' మూవీతో ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఇది దేశ వ్యాప్తంగా ఎఫెక్ట్ చూపిస్తోంది.
రొమాంటిక్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన 'రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ కెరీర్‌లోనే తొలిసారి రొమాంటిక్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా ఏళ్లే అవుతోంది. అయితే, మధ్యలో అనుకోని అవాంతరాల కారణాల వల్ల చాలా సార్లు షూటింగ్ వాయిదా పడింది. ఇక, ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్‌ను కూడా పూర్తి చేసుకున్నారు. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలెన్స్ ఉండడంతో ప్రస్తుతం వాటిపై ఫోకస్ చేశారు. మరీ ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం చాలా సమయం కేటాయించి మరీ మంచి ఔట్‌పుట్ రప్పించేందుకు పాటు పడుతున్నారు. అలాగే, బ్యాగ్రౌండ్ స్కోర్‌పైనా దృష్టి సారించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'రాధే శ్యామ్' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను సైతం ప్రారంభించి.. ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత చేరువ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు పాటలను కూడా విడుదల చేశారు. అన్ని భాషల్లోనూ వాటికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సినిమా విడుదలకు అంతా రెడీ అనుకున్న సమయంలోనే కరోనా ప్రభావం కారణంగా ఇది వాయిదా పడిపోయింది. దీంతో ప్రమోషన్ మళ్లీ మొదటికి వచ్చింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'రాధే శ్యామ్' మూవీ నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల అయ్యాయి. వీటన్నింటికీ అన్ని భాషల్లోనూ భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రం నుంచి నాలుగో పాటను విడుదల చేయబోతున్నారని ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. వాస్తవానికి ఈ సినిమా నుంచి ఇక పాటలను విడుదల చేయకూడదని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ఓ స్పెషల్ లవ్ సాంగ్‌ను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన చేయబోతున్నారని టాక్.
'రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటిస్తోన్నాడు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, భాగ్యశ్రీ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, ఫ్లోరా జాకబ్ వంటి వాళ్లు నటిస్తున్నారు. అలాగే, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలకు జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక, హిందీ వెర్షన్ కోసం మిథూన్, అమాల్ మాలిక్, మనన్ భరద్వాజ్‌లు పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











