తీవ్ర విషాదంలో ప్రముఖ సంగీత దర్శకుడు అను మాలిక్
బాలీవుడ్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు అను మాలిక్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన తల్లి బాలికీస్ మాలిక్ గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. బాలికీస్ ప్రముఖ కవి, సినీ గేయ రచయిత హస్రత్ జైపూరికి సోదరి. ప్రముఖ సంగీత దర్శకుడు సర్దార్ మాలిక్ భార్య. బాలికీస్ మాలిక్‌కు అను మాలిక్, అబు మాలిక్, దబూ మాలిక్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు.
బాలీవుడ్‌లో అనుమాలిక్ టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. మాతృ వియోగంతో బాధపడుతున్న అనుమాలిక్‌కు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. అను మాలిక్ తల్లి మరణం విషయానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కొద్దికాలంగా బాలికీస్ మాలిక్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెను జూలై 22న ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఆరోగ్య నిధి హాస్పిటల్‌లో చేర్పించారు. తన అమ్మమ్మతో కలిసి ఉన్న పాత వీడియోను అర్మాన్ మాలిక్ సోషల్ మీడియాలో పోస్టు చేసి శ్రద్దాంజలి ఘటించారు.
మాతృ వియోగంతో బాధపడుతున్న అనుమాలిక్ కుటుంబానికి టైగర్ ష్రాఫ్, నీతీ మోహన్, వర్ధాన్ పూరి, ఇషా భన్సాలీ, కునాల్ వర్మ, హర్దీప్ కౌర్ తదితరులు సంతాపం ప్రకటించారు. బాలికీస్ మాలిక్ ఆత్మకు శాంతి చేకూరాలి అని తమ సంతాపంలో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











