ఆ పాత్రలు చేసి బోర్ కొట్టింది.. అనుపమ, టైమ్ దొరికితే కెలుకడమే హాబీ.. సిద్దూ!

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం టిల్లు స్వ్కేర్. ఈ సినిమా మార్చి 29వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో పాటను రిలీజ్ చేశారు. ఈ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, అచ్చు రమణి, హీరో, హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, సిద్దూ జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అనుపమ పరమేశ్వరన్, సిద్దూ మాట్లాడుతూ..

నా అందాన్ని బయటపెట్టేందుకు టిల్లు స్క్వేర్ సినిమా అవకాశం ఇచ్చింది. నా కెరీర్‌లో చేసిన పాత్రలే చేయాల్సి రావడం నాకు కొంత అసంతృప్తి కలిగింది. నా టాలెంట్‌ను చూపించేందుకు కొత్త పాత్రలను చేయాలని అనుకొన్నాను. అలాంటి ప్రయత్నంలో వచ్చిన అవకాశమే లిల్లీ పాత్ర. టిల్లు స్క్వేర్‌తో ఆ కోరిక తీరింది అని అనుపమ చెప్పింది.

Siddhu Jonnalagadda

నటిగా నాకు నేను కొత్తగా పాత్రలు చేయాలని మొదటి నుంచి అనుకొంటున్నాను. పక్కింటి అమ్మాయి పాత్రలో నటించి.. చేసిన పాత్రలే చేసి బోర్ అయ్యాను. ఆ తర్వాత లాక్ డౌన్ సమయంలో వరల్డ్ సినిమాను చూశాను. పెర్ఫార్మెన్స్ ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేయాలని అనుకొంటున్నాను. ఏదో హీరోయిన్ అనిపించుకోవడానికి ఈ సినిమా చేయను అని అనుపమ చెప్పారు.

Anupama Parameswaran

టిల్లు క్యారెక్టర్‌కు తగిన పనులే చేయాలి. ఆ క్యారెక్టర్‌కు ఓ బౌండరీ ఉంటుంది. ఈ సినిమాలో అడల్డ్ డోస్ లేదు. ఈ సినిమాలో యూత్‌ఫుల్ డోస్ మాత్రమే ఉంటుంది. ప్రతి సినిమాకు ఒక నేచర్ ఉంటుంది. జీవితంలో రొమాన్స్ చేస్తేనే మనసు విరుగుతుంది. యూత్ డోస్ ఓ వ్యక్తి బాధపడేలా చేస్తుంది. మనసు విరిగిపోయేలా చేస్తుంది. డీజే టిల్లు పాత్రలో ఎలాంటి మార్పు ఉండదు. అతడు కలిసి అమ్మాయి వల్ల అతడి తీరు మారుతుంది అని సిద్దూ అన్నారు.

టిల్లు స్వ్కేర్ సినిమా పిబ్రవరిలోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఛాంబర్ నిర్ణయం కారణంగా సినిమాను వాయిదా వేశాం. అయితే ఈ సమయంలో కొన్ని సీన్లు రీ షూట్ చేశాం. సినిమా కంప్లీట్ అయిన తర్వాత నేను హెయిర్ కట్ చేశాను. అందుచేత నా క్యారెక్టర్‌కు సరిపోయే లుక్ కోసం చైనా నుంచి విగ్ తెప్పించాను. అలా సమయం చిక్కితే సినిమాను కెలికుతూనే ఉంటాం అని సిద్దూ జొన్నలగడ్డ తెలిపారు.

Tillu Square Song

అనుపమ మంచి యాక్టర్. మీరు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా సులభంగా చేస్తుంది. అయితే టిల్లు స్వ్కేర్ సినిమాలో ఆమెతో అలాంటి పాత్రనే చేయించాలనే అనుకోలేదు. ఆ స్థానంలో ఏ హీరోయిన్ ఉన్నా అలాంటి రోల్‌ చేయడానికి ఇష్టపడుతారు. అందుకే అనుపమ కూడా ఒప్పుకొని చేసింది. మేము చేయించాలనే అనుకోలేదు అని సిద్దు అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X