బాలీవుడ్‌లో నాకు వ్యతిరేకంగా ఓ గ్యాంగ్ కుట్ర.. ఏఆర్ రెహ్మాన్ సంచలన ఆరోపణలు

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ పూర్తిగా బాలీవుడ్‌కు దూరమైనట్టు కనిపించింది. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించి తన మార్కును చాటుకొన్న రెహ్మాన్ హిందీ సినిమాలు ఎందుకు చేయడంలేదనే అనుమానాలకు, సందేహాలకు రెహ్మాన్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆయన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా సినిమాకు మ్యూజిక్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో చాలా తక్కువ సినిమాలకు మ్యూజిక్ ఇస్తున్నాను. అందుకు కారణం నాపై కొందరు కుట్రపూరితంగా వ్యవహరించడమే అని అన్నారు.

నేను మంచి చిత్రాలకు దూరంగా ఉండటం లేదు. బాలీవుడ్‌లో ఓ గ్యాంగ్ నాకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తనను తప్పుడు రీతిలో అర్ధం చేసుకొన్నారు. దిల్ బేచారా దర్శకుడు ముఖేష్ చాబ్రా నా వద్దకు వచ్చి పాటలు, మ్యూజిక్ కావాలని అడిగారు. రెండు రోజుల్లో నాలుగు పాటలు ఇచ్చారు. చాలా మంది రెహ్మాన్ వద్దకు వెళ్లవద్దని చెప్పారు. కానీ వారు చెప్పింది విని నా నిర్ణయం తీసుకొన్నానని ముఖేష్ చెప్పారు. మీరు ఎందుకు హిందీ సినిమాలు చేయడం లేదో ఇప్పుడు అర్ధమైందని ఆయన అన్నారు. హిందీలో మంచి సినిమాలకు మ్యూజిక్ అందించపోవడానికి కారణం ఓ గ్యాంగే అని ఆయన అన్నారు.

AR Rahman: A gang working against me in Bollywood

హిందీ ప్రేక్షకులు నా మ్యూజిక్ కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో బాలీవుడ్‌లో ఓ గ్యాంగ్ నన్ను పనిచేయకుండా అడ్డుకొంటున్నది. నేను ఏం చేయాలో ఏం చేయవద్దో అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. నా వద్దకు వచ్చిన సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. నాకు వచ్చే అవకాశాలన్నింటిని దేవుడే పంపిస్తాన్నారని భావిస్తున్నాను అని రెహ్మాన్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X