నాపై కుట్ర పన్నిన గ్యాంగ్స్ కనుమరుగు.. అతడి వల్లే అలా మారాను.. ఏఆర్ రెహ్మన్ సెన్సేషనల్ కామెంట్స్
ఆస్కార్ పురస్కార గ్రహీత, మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ రచయితగా, నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం 99 సాంగ్స్. మ్యూజికల్ రొమాంటిక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 16వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఏఆర్ రెహ్మన్, హీరో ఇహాన్ భట్, ఇతర యూనిట్ సభ్యులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఆర్ రెహ్మన్ మాట్లాడుతూ..
AR Rahman Produceing 99 Songs Movie Press meet Photos

అతడి వల్లే కథకుడిగా మారా
మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రయాణం సాగుతున్న సమయంలో రచయితగా మారమనే ఆలోచనను ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ మార్క్ వెబ్ నా మదిలో నాటాడు. అప్పటి నుంచి నేను మ్యూజిక్‌తోపాటు కథల గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత చాలా కథలు నా సహచరులతో పంచుకొన్నాను. ఆ క్రమంలోనే 99 సాంగ్స్ కథ పురుడు పోసుకొన్నది అని ఏఆర్ రెహ్మన్ తెలిపారు.

అకాడమీలో వర్క్‌షాపుల ప్రభావంతో
ఆస్కార్ అవార్డు గెలుచుకొన్న తర్వాత అకాడమీలో సభ్యుడిగా చేరాను. అప్పటి నుంచి అకాడమీలో జరిగే స్క్రీన్ ప్లే, స్టోరీ రైటింగ్, ఇతర అంశాలకు చెందిన వర్క్‌షాప్‌లకు హాజరయ్యాను. దాంతో నాకు సినిమా మేకింగ్‌లో అన్ని విభాగాల మీద పట్టు పెరిగింది. దాంతో సినిమా నిర్మాణం వైపు ఆసక్తి పెరిగింది. అందుకే నిర్మాతగా మారాను అని ఏఆర్ రెహ్మాన్ చెప్పారు.

వివాదంగా ఏఆర్ రెహ్మన్ కామెంట్స్
ఇదిలా ఉండగా, బాలీవుడ్‌లో కొందరు గ్యాంగ్‌గా తనకు వ్యతిరేకంగా పనిచేశారని, అందుకే బాలీవుడ్ చిత్రాలకు దూరమయ్యానని కొద్ది నెలల క్రితం ఓ ఇంటర్యూలో చెప్పారు. తనకు ప్రాజెక్టులు రాకుండా కొందరు కుట్ర పన్నారు అని చెప్పారు. దాంతో రెహ్మన్ ఇంటర్వ్యూ వైరల్ కావడమే కాకుండా వివాదంగా మారింది.

ఆ గ్యాంగులు ఇప్పుడు లేవు...
అయితే బాలీవుడ్‌లో అాలాంటి కుట్రలు, గ్యాంగులు ఇంకా కొనసాగుతున్నాయా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. అలాంటి గ్యాంగులు కనమరుగు అయ్యాయి. ఇప్పుడు బాలీవుడ్‌లో సానుకూలమైన పరిస్థితులు నెలకొన్నాయి అని ఏఆర్ రెహ్మాన్ పేర్కొన్నారు.
Recommended Video

99 సాంగ్స్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు
ఇక 99 సాంగ్స్ మూవీ కాస్టింగ్ విషయానికి వస్తే.. ఇహాన్ భట్, ఎడిసీ వర్గాస్, టెంజిన్ దాల్హా, ఆదిత్య సీల్, లీసారే, మనీషా కోయిరాల, థామస్ ఆండ్రూ, రంజిత్ బారట్, రాహుల్ రామ్, రెమో ఫెర్నాండేజ్, కునాల్ కమ్రా, అశ్వంత్ భట్, కురుష్ దేబూ తదితరులు నటించారు.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విశ్వేష్ కృష్ణమూర్తి
కథ, నిర్మాత, మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్
రచయితలు: హుస్సేన్ దలాల్ (హిందీ), గౌతమ్ మీనన్ (తమిళం), కిరణ్ (తెలుగు)
సినిమాటోగ్రఫి: తనయ్ సతమ్, జేమ్స్ కౌలీ
ఎడిటింగ్: అక్షయ్ మెహతా, శ్రేయాస్ బెల్టాంగ్డీ
బ్యానర్: ఐడియల్ ఎంటర్‌టైన్‌మెంట్, వైఎమ్ మూవీస్
రిలీజ్: 2021-04-16


Click it and Unblock the Notifications











