ఎన్టీఆర్ సినిమా కోసం రంగంలోకి ఇండియా టాప్ మ్యూజిక్ డైరెక్టర్?
జూనియర్ ఎన్టీఆర్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో కూడా ఓ సినిమా చేయాలని అనుకుంటున్నా విషయం తెలిసిందే. ఇంకా ఈ కాంబినేషన్ పై అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు గానే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ దర్శకుడితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కు బుచ్చిబాబు పవర్ఫుల్ కథను కూడా వినిపించినట్లు తెలుస్తోంది. లోకల్ కథనే పాన్ ఇండియా రేంజ్ లో చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడట. దర్శకుడి కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు కూడా కాస్త నమ్మకం కలిగినట్లుగా తెలుస్తోంది. భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు తన రెండవ సినిమా విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎలాగైనా అగ్రహీరోతో భారీ స్థాయిలో ఈ సినిమాను తెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు. మీడియం రేంజ్ హీరోలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అతని ఫోకస్ మాత్రం ఎన్టీఆర్ పైనే ఉంది. మైత్రి మూవీ మేకర్స్ కూడా బుచ్చిబాబుకి చాలా పాజిటివ్ సపోర్టు ఇవ్వడంతో బడ్జెట్ విషయంలో కూడా ఏమాత్రం లిమిట్స్ లేకుండా సినిమాను రూపొందించే అవకాశం ఉందట. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసే విధంగా బుచ్చిబాబు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్ అయితే కాస్త పాజిటివ్గానే స్పందించినట్లు తెలుస్తోంది.

అయితే ముందుగానే బుచ్చిబాబు సినిమాకు సంబంధించిన ఒక ప్లాన్ అయితే సిద్ధం చేసుకోవాలని అనుకుంటున్నాడట. మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో అతను ఈ సారి భారీ స్థాయిలో ఆలోచించినట్లుగా తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్.రెహమాన్ ను సంప్రదించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా పారితోషికం అందుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్స్ లలో రెహమాన్ టాప్ లో ఉన్నాడు అని చెప్పాలి. ఇక అలాంటి సంగీత దర్శకుడు ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాకు కూడా తప్పకుండా న్యాయం చేస్తాడు అని చెప్పవచ్చు. ఇక దర్శకుడు సినిమాను స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నే తెరపైకి తీసుకు రాబోతున్నట్లు సమాచారం. కోకో, కబడ్డీ వంటి బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందట.
అది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రిబుల్ ఆర్ సినిమాలు విడుదలకు సిద్ధం చేయగా కొరటాల శివతో తన 30వ సినిమాను మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఇక కొరటాల శివ ప్రాజెక్టు లో ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కొరటాల శివ ప్రాజెక్టు అనంతరం వీలైనంత త్వరగా బుచ్చిబాబు సినిమాను కూడా ఫినిష్ చేయాలని ఎన్టీఆర్ అనుకుంటున్నాడు. అంతేకాకుండా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా ఒక ప్రాజెక్ట్ ను ఓకే చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి రానుంది. ఇక ఈ లోపు బుచ్చి బాబుతో చేయాల్సిన సినిమాలను ఎన్టీఆర్ పూర్తి చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











