A.R. Rahman: సంగీత స్వరకర్తకు అరుదైన గౌరవం.. ఆ దేశంలో అందరూ గుర్తించేలా..

భారతదేశం గర్వించదగిన సంగీత దర్శకులలో ఏఆర్ రెహమాన్ టాప్ లో ఉంటారు అని చెప్పవచ్చు. కేవలం ఒక దేశానికి మాత్రమే కాకుండా ఆయన సంగీతాన్ని ప్రపంచానికి కూడా నచ్చే విధంగా పాటలు కంపోజ్ చేస్తారు. సంగీతం అనేది భాషకు సంబంధించింది అలాగే ఒక ప్రాంతానికి సంబంధించింది కాదని కూడా ఆయన నిరూపించారు. కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ స్థాయిలో గుర్తింపును అందుకున్న అతి కొద్ది మంది సంగీత దర్శకులలో రెహమాన్ ఒకరు. ఇక ఆయన టాలెంట్ కు తగ్గట్టుగానే ఎన్నో పురస్కారాలు వచ్చాయి దేశ విదేశాల ప్రముఖుల నుంచి కూడా ఆయనకు ప్రశంసలు అందాయి. ఇక ఇటీవల ఒక దేశంలో మరొక ప్రత్యేకమైన గౌరవాన్ని అందుకోవడం విశేషం.

2010లో గ్రామీ అవార్డ్ గెలుచుకున్న సంగీత స్వరకర్త AR రెహమాన్ కెనడా నుండి మరో మంచి గౌరవాన్ని అందుకున్నారు. కెనడాలోని మార్ఖం నగరానికి అతని పేరు పెట్టారు. ఈ వార్తను షేర్ చేసుకుంటూ.. ట్వీట్‌లో మేయర్ ఫ్రాంక్ స్కార్పిట్టికి రెహమాన్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే కెనడా ప్రజలకు కూడా తన కృతజ్ఞతలు తెలిపాడు. రెహమాన్ ఈ విధంగా స్పందించారు.. "నా జీవితంలో ఇలాంటి గౌరవాన్ని నేను ఎప్పుడూ ఊహించలేదు. మార్కమ్ మేయర్, కెనండా (ఫ్రాంక్ స్కార్పిట్టి) అలాగే కౌన్సెలర్‌లు, ఇండియన్ కాన్సులేట్ జనరల్ (అపూర్వ శ్రీవాస్తవ) లకు అలాగే కెనడా ప్రజలందరికీ నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

AR Rahman is honoured to have a street in Canada named after him

'అల్లా రఖా రెహమాన్ సెయింట్' అని రాసి ఉన్న బోర్డును పట్టుకుని ఉన్న ఫొటోను రెహమాన్ షేర్ చేసుకున్నాడు. ఏఆర్ రెహమాన్ అనే పేరు నాది కాదు అంటూ దయగల వాడు అని అర్థం అని దయామయుడు అనేది మనందరికీ ఉన్న సాధారణ దేవుని గుణమే అని అన్నారు. ఇక కెనడాలో నివసిస్తున్న ప్రజలందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందం ఆరోగ్యాన్ని దేవుడు అందించాలని కోరుకుంటున్నాను. దేవుడు మీ అందరినీ చల్లగా చూడాలి. భారతదేశంలోని నా సోదరులు సోదరీమణులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నాతో పనిచేసిన సృజనాత్మక వ్యక్తులందరూ నేను ఎదగడానికి నాకు స్ఫూర్తిని ఇచ్చారు. నేను సముద్రంలో చాలా చిన్న బిందువును అని రెహమాన్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X