ఏఆర్ రెహమాన్ నిర్మాతగా సంగీత ప్రధాన చిత్రం ‘99 సాంగ్స్’.. రిలీజ్ ఎప్పుడంటే?
ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. తన బేనర్లో తొలి చిత్రంగా '99 సాంగ్స్' అనే మ్యూజికల్ ఫిల్మ్ నిర్మిస్తున్నారు. అంతే కాదు ఈ మూవీ కథ రాసింది కూడా ఆయనే కావడం విశేషం. విశ్వేష్ క్రిష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా రెహమాన్ తన సినిమా రిలీజ్ గురించి సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేశారు. '99 సాంగ్స్' చిత్రం జూన్ 21, 2019న హిందీ, తమిళం, తెలుగులో విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.

ఈ సినిమా గురించి విడుదల చేసిన ఓ స్టేట్మెంట్లో... 'నిర్మాతగా, రచయితగా నా తొలి సినిమా అనౌన్స్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. '99 సాంగ్స్' అనేది యంగ్, పాషనేట్ లవ్ స్టోరీ నేపథ్యంలో సాగే సినిమా. సంగీతం ఈ చిత్రానికి ఆత్మ. నా ప్రొడక్షన్ కంపెనీ 'వైఎం మూవీస్'... జియో స్టూడియోస్ వారితో కలిసి ఈ ప్రత్యేకమైన సినిమా చేశాం' అని రెహమాన్ పేర్కొన్నారు.
'99 సాంగ్స్' చిత్రాన్ని మూడు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. మీ అందరి ప్రేమ, మద్దతు, ప్రోత్సాహం వల్లనే నేను ఈ రోజు ఈ ప్రాజెక్ట్ చేయగలిగాను. అందుకు మీకు ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాను అని రెహమాన్ చెప్పుకొచ్చారు.
'99 సాంగ్స్' చిత్రంలో ఎహాన్ భాట్, ఎడిల్సీ వెరగాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మనీషా కొయిరాలా, లీసా రే, థామస్ ఆండ్రూస్, ఆదిత్య సీల్ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఒక స్ట్రగులింగ్ సింగర్ కథ నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











