twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏఆర్ రెహ్మాన్ కూతురుకు తప్పని వివాదాలు.. ‘ఫరిస్థాన్’ మ్యూజిక్ ఆల్బమ్‌తో ప్రపంచంలోకి

    |

    మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహ్మాన్ కూతురు ఖతీజా రెహ్మాన్ తాజాగా వివాదంలో కూరుకుపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బుర్ఖా ధరించడంపై చేసిన వ్యాఖ్యలు మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించాయి. బుర్ఖా ధరించడం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం చేశారు. కానీ సంప్రదాయాలు కొందరు పెట్టడం, వాటిపై జడ్జిమెంట్లు ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ నాకు బుర్ఖా ధరించడం అత్యంత ఇష్టం అంటూ ఖతీజా వ్యాఖ్యలు చేశారు.

    సమాజంలో మహిళలపైనే చాలా ఆంక్షలు ఉన్నాయి. పురుషుల కంటే మహిళలనే టార్గెట్ చేయడం దారుణం. కులాలు, హోదాలను కూడా పట్టించుకోకుండా టార్గెట్ చేస్తుంటారు. కొందరు పనిలేని వాళ్లు మా లాంటి వాళ్ల ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంటారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

     AR Rahmans daughter Khatija Rahman in Burqa controversy

    ఇటీవల తన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి.. మీరు బుర్ఖాలో కనిపించే అరుదైన సింగర్ అంటూ కొందరు కామెంట్లు చేశారు. హాలీవుడ్‌లో మార్షమెల్లో తనకు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. కానీ ఆమెను ఎవరూ పట్టించుకోరు. నన్నే ఎందుకు టార్గెట్ చేస్తుంటారు అని కామెంట్ చేశారు.

    ఏఆర్ రెహ్మాన్ కూతురుగా ఖతీజా రెహ్మాన్ ఇటీవల మ్యూజిక్ రంగంలోకి ప్రవేశించారు. ఇటీవల తాను రూపొందించిన ఫరిస్థాన్ ఆల్బమ్‌ను రిలీజ్ చేశారు. ఈ ఆల్బమ్‌కు తండ్రి రెహ్మాన్ నిర్మాతగా వ్యవహరిస్తే.. మున్నా షేక్ షోకత్ ఆలీ సాహిత్యం అందించారు.

    English summary
    World's popular music legend AR Rahman's daughter Khatija Rahman in Burqa controversy. She made sensational comments on Burqa wearing. She came Farishton music Album recently which produced by AR Rahman
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X