PS 2 Trailer: హై లెవెల్లో పొన్నియిన్ సెల్వన్ ట్రైలర్ రెడీ చేస్తున్న రెహమాన్.. మ్యూజిక్ కూడా ఆ రోజే లాంచ్!
దిగ్గజ దర్శకుడు మణిరత్నం తీసిన 'పొన్నియన్ సెల్వన్ -1' గత ఏడాది విడుదలై తమిళంలో ఘన విజయం సాధించి తెలుగులో కూడా పాజిటివ్ టాక్ అందుకుంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను విడుదల చేయడంతో తమిళంలోనే కాకుండా చాలా చోట్ల బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
అయితే పొన్నియన్ సెల్వన్ -2 వసూళ్ళ పరంగా ఈసారి మరీంత హై లెవెల్ లో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా మొదటి భాగం రిలీజ్ కు ముందే సీక్వెల్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుంది అని తెలియజేశారు. ఇక PS 2 ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుండడంతో అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించింది సినిమా యూనిట్. ఈనెల 29వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించగా ఇప్పుడు అదే రోజు సినిమా మ్యూజిక్ కూడా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు సంగీత దర్శకుడు రెహమాన్. ఆయన ఇచ్చిన అప్డేట్ తో పొన్నియన్ సెల్వన్-2 సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
విక్రమ్, జయం రవి, కార్తీక్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష, శోభిత దూళిపాళ్ల వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్-2 సినిమా మ్యూజిక్, అలాగే సినిమా ట్రైలర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఇక రెహమాన్ షేర్ చేసిన వీడియోలో సాంగ్స్ రికార్డింగ్ కూడా కనిపిస్తోంది. సింగర్లు శక్తి శ్రీ గోపాలన్, శ్వేతా మోహన్, చిన్మయి ఈ సినిమా కోసం పాటలు పాడినట్టు తెలుస్తోంది. ఏడు పాటలు ఒక ఆల్బమ్ అంటూ రెహమాన్ షేర్ చేసిన వీడియో ద్వారా ఎన్ని సాంగ్స్ ఉన్నాయి అనే విషయం కూడా చెప్పేశారు.


Click it and Unblock the Notifications











