త్రివిక్రమ్ అలా చేశారేంటి? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాకే! అందుకే త్యాగం చేశారట..

Recommended Video

Aravinda Sametha Jukebox Surprises NTR Fans

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న అరవింద సమేత చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్లకు అనూహ్యమైన స్పందన లభించింది. ఇటీవల రిలీజైన లిరికల్ పాటలకు బ్రహ్మండమైన రెస్సాన్స్ వచ్చింది. తాజాగా గురువారం చిత్ర యూనిట్ ఆడియో జూక్ బాక్స్‌ను రిలీజ్ చేసింది. ఇంతకీ అరవింద సమేత పాటలు ఉన్నాయంటే..

రొటీన్‌కు భిన్నంగా తమన్

రొటీన్‌కు భిన్నంగా తమన్

ఎస్ఎస్ తమన్ అందించిన సంగీతం రొటీన్‌కు భిన్నంగా ఉంది. పాటల్లో ఆర్ధత, ఆవేదన కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఆడియో పరంగా మంచి సాహిత్యం ప్రేక్షకుడి గుండె‌ను తట్టి లేపింది. ఏడ పోయినాదో అనే పాట భావోద్వేగానికి గురిచేసేలా ఉంది. నిఖితా శ్రీవల్లి, కైలాష్ ఖేర్, పెంచల్ దాస్ పాడగా, సిరివెన్నెల, పెంచల్ దాస్ సాహిత్యాన్ని అందించాడు.

గుండెను పిండేసేలా ‘పెనివిటి' పాట

గుండెను పిండేసేలా ‘పెనివిటి' పాట

ఇక పెనివిటి పాట వింటనే గుండెను పిండేసిన ఫీలింగ్ కలిగింది. తెర మీద త్రివిక్రమ్ ఎలా ఆవిష్కరించారో అనే విషయం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. ఆర్మన్ మాలిక్ ఆలపించారు. అనగనగా పాట కూడా అద్బుతమైన సాహిత్య విలువలతో ఆకట్టుకొన్నది. అరవిందుడు తన పేరు.. అందానికి సొంతూరు.. అందుకే అంత పొగరు అంటూ సాగే ఉత్సాహాన్ని రేపింది.

మాస్‌ బీట్‌తో రెడ్డి ఇక్కడ సూడు పాట

మాస్‌ బీట్‌తో రెడ్డి ఇక్కడ సూడు పాట

ఇక ఎన్టీఆర్ క్రేజ్‌కు తగినట్టుగా రెడ్డి ఇక్కడ సూడు అనే పాట మంచి మాస్ బీట్‌తో చెలరేగింది. పాత చిత్రంలోని ఓ పాటతో ఆరంభమైన పాటను దలేర్ మెహందీ, అంజనా సౌమ్య పాడిన పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. థియేటర్‌లో ఈ పాటకు ఈలలు గట్టిగానే పడే సూచనలు కనిపిస్తున్నాయి.

 నాలుగు పాటలేంటి?

నాలుగు పాటలేంటి?

ఇక అరవింద సమేత ఆడియోలో షాకింగ్ కలిగించే విషయాలు ఏమిటంటే.. ఎన్టీఆర్ సినిమా అంటే దుమ్మురేపే కనీసం ఐదు లేదా ఆరు మాస్, మెలోడి పాటలను అభిమానులు ఆశిస్తారు. అలాంటిది ఈ చిత్రంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ నాలుగు పాటలకే పరిమితం కావడం ఫ్యాన్స్ జీర్ణించుకోగలరా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

కథ కోసమే పాటలు త్యాగం

అరవింద సమేత చిత్ర కథ చాలా ఎమోషనల్‌గా సాగుతుందనేది సినీ వర్గాల సమాచారం. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌గా భావోద్వేగాల నడుమ ఈ సినిమా సాగుతుందని, డైలాగ్స్, యాక్షన్ సీన్లు పిచ్చపిచ్చగా ఉంటాయని చెప్పుకొంటున్నారు. కథా ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని నాలుగు పాటలకే పరిమితమయ్యారు అనే మాట వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X