అరవింద సమేత తొలి పాట వచ్చేసింది.. ఎన్టీఆర్‌ని ఆటపట్టిస్తూ!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై తారాస్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. అక్టోబర్ లో ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయనున్నారు. తాజగా ఈ చిత్రంలోని తొలి పాట విడుదల చేశారు. లిరికల్ వీడియో రూపంలో యూట్యూబ్ లో విడుదల చేశారు.
ఈ సాంగ్ ని సంగీత దర్శకుడు తమన్ వినసొంపైన మెలోడీ సాంగ్ గా మలిచాడు. పాటలోని సంగీతం ఆహ్లాద భరితంగా ఉంది. లెజెండ్రీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన లిరిక్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అనగనగా.. అరవిందట తనపేరు.. అందానికి సొంతూరు.. అందుకనే ఆ పొగరూ అంటూ సాగే లిరిక్స్ బావున్నాయి.
ఇక సాంగ్ ప్రారంభంలో టీజర్ తరహాలో పూజ హెగ్డే డైలాగ్ కూడా జత చేశారు. పూజ హెగ్డే కారులో కూర్చుని ఎన్టీఆర్ వంక చూస్తూ.. టఫ్ గా కనిపిస్తారు కానీ.. మాట వింటారు.. పర్లేదు అని పూజ అంటే ఎన్టీఆర్ సిగ్గు పడుతూ కనిపిస్తాడు.



Click it and Unblock the Notifications











