అరవింద సమేత 'పెనివిటి' సాంగ్.. హృదయాన్ని హత్తుకునేలా, తమన్ అదరగొట్టేశాడు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత చిత్ర సందడి మొదలైంది. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచేశారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటల సందడి మొదలైంది. ఇప్పటికే విడుదలైన అనగనగా అనే సాంగ్ అదరగొడుతోంది. తాజాగా పెనివిటి అనే సాంగ్ ని విడుదల చేశారు.

ఈ సాంగ్ వినగానే హృదయాన్ని హత్తుకునేలా ఉంది. తమన్ అందించిన సంగీతం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం వింటే పాటలో లీనమైపోతారు. అంత ఎమోషనల్ గా ఈ సాంగ్ ఉంది. రాయలసీమ యాసలో, రాయలసీమ వాడుక పదాలు ఉపయోగిస్తూ రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సంగీతాని అందించారు.
అరవింద సమేత సాంగ్స్ విడుదల విషయంలో చిత్ర యూనిట్ ప్రత్యేకంగా వ్యవహరిస్తూంది. అనగనగా సాంగ్ ప్రారంభంలో టీజర్ లాంటి పూజ హెగ్డే డైలాగ్ చూపించినట్లు పెనివిటి సాంగ్ లో కూడా ఎమోటినల్ డైలాగ్ చూపించారు. 'నువ్వు కడుపున పడినాకే మీ అమ్మని గెలిసేసినాను అనుకున్నాడో ఏందో.. దాన్ని వంటింట్లో వదిలేసి వరండాలో పోయి ఊరిని గెలచడం మొదలు పెట్నాడు' అనే డైలాగ్ ఈ చిత్రంలో ఎమోటినల్ యాంగిల్ ని చూపిస్తోంది.


Click it and Unblock the Notifications











