ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన అరవింద సమేత యూనిట్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత ఆడియో ఈ నెల 20 న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీని గురించి చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. తాజాగా మరో ప్రకటన చేస్తూ అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. అరవింద సమేత చిత్రానికి ఆడియో వేడుక నిర్వహించడం లేదని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఆ వార్తలు నిజమయ్యాయి. అరవింద సమేత చిత్ర పాటలని నేరుగా మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. ఆడియో వేడుక నిర్వహించడం లేదని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ సినిమా విడుదలకు దగ్గర్లో ప్రీ రిలీజ్ వేడుకని గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉండగా రేపు అరవింద సమేత చిత్రానికి సంబంధించి మరో సర్ ప్రైజ్ ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. త్రివిక్రమ్ దర్శత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల విడుదలైన తొలి పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

Aravindha Sametha Prerelease event update

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X