వీడియో: అరవింద సమేతలో రెడ్డెమ్మ తల్లి కవర్ సాంగ్.. గుండెలు పిండేసేలా పాడాడు!
Recommended Video

అరవింద సమేత చిత్రం రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన మ్యాజిక్ ఫలించింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ తన నటనతో విశ్వరూపం చూపించాడు. చిత్ర విడుదల తరువాత కూడా మంచి ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తాజగా ఈ చిత్రంలో రెడ్డెమ్మ తల్లి కవర్ సాంగ్ విడుదల చేశారు.

రెడ్డెమ్మ తల్లి సాంగ్
అరవింద సమేత చిత్రంలో రెడ్డెమ్మ తల్లి అనే సాంగ్ ఫిమేల్ వాయిస్ లో వినిపిస్తోంది.తాజగా ఈ పాట కవర్ వర్షన్ ని విడుదల చేశారు. కవర్ వర్షన్ ని ఈ పాట రచయిత పెంచాలి దాస్ స్వయంగా పాడారు. ఓ ఎమోషనల్ సీన్ లో భాగంగా ఈ సాంగ్ ని సినిమాలో చేర్చారు.
గుండెలు పిండేసేలా
ఈ పాట మొత్తం రాయలసీమ యాసలో, అచ తెలుగు పదాలతో సాగుతుంది. పెంచల్ దాస్ గానం గుండెలు పిండేసే విధంగా ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ రాయలసీమ యాసలో పలికిన డైలాగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే.

అడ్డు లేకుండా
అరవింద సమేత చిత్ర వసూళ్లు అడ్డు లేకుండా దూసుకుపోతున్నాయి. కేవలం ఐదు రోజుల్లోనే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్లకు పైగా షేర్ సాధించిన సంగతి తెలిసిందే. దసరా రోజు వసూళ్ళు మరింత జోరందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా అరవింద సమేత రికార్డ్ నెలకొల్పబోతోంది.

ఫ్యాక్షన్ విలన్‌గా
అరవింద సమేత చిత్రంలో విలన్ గా జగపతి బాబు పోషించిన పాత్ర మరో ఆకర్షణగా నిలిచింది. హీరోయిన్ గా క్రేజీ బ్యూటీ పూజ హెగ్డే నటించింది. నాగబాబు కీలక పాత్రలో నటించారు. తమన్ సంగీతం అందించాడు.


Click it and Unblock the Notifications











