తీవ్ర విషాదంలో సింగర్ అర్జిత్ సింగ్.. కుటుంబంలో కరోనా కలకలం!
బాలీవుడ్‌లో ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్ కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకొన్నది. కరోనావైరస్ పాజిటివ్‌తో కోల్‌కతాలోని ధాకురియాలోని ఏఎంఆర్ఐ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన తల్లి బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 52 సంవత్సరాలు.
అర్జిత్ సింగ్ తల్లికి మే 17వ తేదీన కోవిడ్ నెగిటివ్ అని తేలింది. అయితే కోలుకొంటున్న సమయంలో మెదడులో స్ట్రోక్ వచ్చింది. దాంతో ఆమెను ఎక్మోపై ఉంచి ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. అయితే ఊహించని విధంగా ఆమె బుధవారం కన్నుమూశారు. ఆమెను అర్జిత్ కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం 5 గంటలకు చివరిచూపు చూసుకొన్నారు అని కుటుంబ సభ్యులు తెలిపారు.

మాతృవియోగంతో బాధపడుతున్న అర్జిత్ సింగ్‌కు బాలీవుడ్ ప్రముఖులు మానసికంగా అండగా నిలిచారు. పుట్టెడు బాధలో ఉన్న ఆయనను ఫోన్‌లో పరామర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తూ అర్జిత్ సింగ్ తల్లి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.
అర్జిత్ సింగ్ కెరీర్ విషయానికి వస్తే.. 2010లో గోల్‌మాల్ 3, క్రూక్, యాక్షన్ రిప్లై చిత్రాలతో కెరీర్ ప్రారంభించారు. అలాగే తెలుగులో 2010లో సందీప్ చౌతా సంగీత దర్శకత్వంలో కేడీ సినిమాలో నీవే నా నీవే నా పాటను పాడారు. ఆ తర్వాత పలు సినిమాలకు పనిచేసిన తర్వాత ఆషికీ2 సినిమాతో అద్భుతమైన గుర్తింపు పొందారు. అప్పటి నుంచి ప్రముఖ గాయకుడిగా ఎన్నో మధురమైన పాటలను సంగీత ప్రియులకు అందించారు.


Click it and Unblock the Notifications











