బుట్టబొమ్మ తరువాత మళ్లీ ఇలా.. ‘బ్యాచ్‌లర్’ కోసం అర్మాన్ మాలిక్
అఖిల్ పూజా హెగ్డేల కాంబినేషన్‌లో రాబోతోన్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అప్పుడెప్పుడో బొమ్మరిల్లు సినిమా హిట్ కొట్టిన భాస్కర్ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇలా బ్యాచ్‌లర్ అంటూ రాబోతోన్నాడు. మధ్యలో ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టలేకపోయాడు. కానీ ఈ సారి మాత్రం భాస్కర్ మరింత కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్టు కనిపిస్తోంది.
ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్రంపై బొమ్మరిల్లు భాస్కర్ బాగానే ఆశలు పెట్టుకున్నాడు. మామూలుగా గోపీ సుందర్ సంగీతమంటే సినిమాలకు బాగానే ప్లస్ అవుతుంటాయి.అలా ఈ బ్యాచ్‌లర్ సినిమాకు గోపీ సుందర్ కూల్ మ్యూజిక్, ఆహ్లాదకరమైన సంగీతాన్ని అందించబోతోన్నట్టు కనిపిస్తోంది.

బుట్టబొమ్మ పాటతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు అర్మాన్ మాలిక్. వాలెంటైన్స్ డే సందర్భంగా బ్యాచ్‌లర్ నుంచి గుచ్చే గులాబి అనే పాట రాబోతోంది. ఈ పాటను అర్మాన్ మాలిక్ ఆలపించాడు. రేపు విడుదల కాబోతోన్న ఈ పాటకు సంబంధించిన వీడియోను తాజాగా విడుదల చేశారు. ఫిబ్రవరి 13 ఉదయం 11 గంటల 10 నిమిషాలకు రాబోతోందని ప్రకటించారు. జూన్ 19న ఈ మూవీ విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











