twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ రాక్‌స్టార్ ఆత్మహత్య.. ‘మీ టూ’ ఆరోపణలతో మనస్తాపం.. సూసైడ్ లెటర్‌లో..!

    |

    మైనర్‌ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో మనస్తాపం చెందిన మెక్సికన్ రాక్‌స్టార్ అర్మాండో వెగా గిల్‌ ఆత్మహత్య చేసుకొన్నారు. సోమవారం ఉదయం సూసైడ్ నోటు రాసి ఆత్మహత్య చేసుకోవడం ప్రపంచ సంగీత సామ్రాజ్యంలో విషాదం నిండుకొన్నది. తనపై వచ్చిన ఆరోపణలున్నీ అవాస్తవం అని లేఖలో పేర్కొనడం గమనార్హం. వివరాల్లోకి వెళితే...

    వెగా గిల్‌పై లైంగిక ఆరోపణలు

    వెగా గిల్‌పై లైంగిక ఆరోపణలు

    బాసిస్ట్ ఆఫ్ మెక్సికన్ రాక్ బ్యాండ్ బొటెల్లిటా డీ జెరేజ్ వ్యవస్థాకుడు అర్మాండో వెగా గిల్‌పై ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. 13 ఏళ్ల బాలికను లైంగిక వేధించాడు అని ఆరోపించారు. దాంతో కొద్దికాలంగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నాడు. అయితే అనూహ్యంగా సోమవారం ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది.

    ఆరోపణలన్నీ అవాస్తవాలు

    ఆరోపణలన్నీ అవాస్తవాలు

    తన సూసైడ్ లెటర్‌లో గిల్ రాసినదేమిటంటే.. నాపై వచ్చిన లైంగిక ఆరోపణలన్నీ అవాస్తవమని చెబుతున్నాను. నా మరణం నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం కాదు. నా అమాయకత్వాన్ని చూసి నాపై దారుణమైన ఆరోపణలు చేశారు. నాపై వచ్చిన ఆరోపణలు నా కొడుకు జీవితంపై మచ్చ తేకూడదు. అందుకే సత్యాన్ని వెల్లడించడానికే సూసైడ్ చేసుకొంటున్నాను అని లేఖలో తెలిపారు.

    నా మరణానికి కారణం ఎవరూ కాదు

    నా మరణానికి కారణం ఎవరూ కాదు

    నా మరణానికి ఏ ఒక్కరు కారణం కాదు. మరొకరిపై నా మరణానికి సంబంధించిన ఆరోపణలు చేయద్దు. నా ఆత్మ ప్రభోదానుసారంగానే సూసైడ్ చేసుకొన్నాను. ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతం. నా పూర్తి స్వేచ్ఛతో ఈ నిర్ణయం తీసుకొన్నాను అని వెగా గిల్ తన సూసైడ్ లెటర్‌లో వెల్లడించారు.

    మరణానికి రెండు గంటల ముందు

    మరణానికి రెండు గంటల ముందు

    వెగా గిల్ మరణంపై రాక్ బ్యాండ్ ప్రతినిధి ఒకరు స్పందించారు. ఆయన మరణానికి రెండు గంటల ముందు నాతో మాట్లాడారు. లైంగిక ఆరోపణలతో మానసికంగా కుంగిపోయాడు. తనపై వచ్చిన ఆరోపణలను ఎలా తుడిచివేసుకోవాలనే ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. మాట్లాడినంత సేపు తీవ్ర విచారంలో మునిగిపోయారు అని తెలిపారు.

    వెగా గిల్ మరణంపై ఆందోళన

    వెగా గిల్ మరణంపై ఆందోళన

    వెగా గిల్ మరణంతో ఒక్కసారిగా మీటూ ఉద్యమంపై మెక్సికన్ సోషల్ మీడియాలో ఉధృతంగా చర్చ జరుగుతున్నది. తాను అమాయకుడైతే న్యాయం పోరాటం చేసి తన నిజాయితీని నిరూపించుకోవాల్సింది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అతడి ప్రతిష్ఠకు పూర్తిగా భంగం వాటిల్లడమే అతను ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది అనే మాటను వినిపిస్తున్నారు.

    English summary
    The founder and bassist of the Mexican rock band Botellita de Jerez, 64-year-old Armando Vega Gil, killed himself on Monday after posting a suicide letter on Twitter that said he was falsely and anonymously accused of sexually abusing a minor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X