NBK108: బాలయ్య సినిమా నుంచి మరో లీక్.. అది వచ్చినంత సేపూ థియేటర్లు షేకే!
కెరీర్ ఆరంభం నుంచే హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను, అభిమానులను ఖుషీ చేస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆయన మరింత జోష్‌తో కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే వరుస చిత్రాలతో అలరిస్తున్నారు.
ఇలా ఈ ఏడాది ఆరంభంలోనే 'వీర సింహా రెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి కూడా అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ మూవీ ఆయన కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లను వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేసింది.

వరుస హిట్లతో ఫామ్‌లో ఉన్న బాలయ్య ప్రస్తుతం తన 108వ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ను మొదలెట్టి ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే కొత్త షెడ్యూల్‌ను మొదలు పెట్టాలని అనుకున్నా.. తారకరత్న మరణం కారణంగా బాలయ్య షూటింగ్‌లో పాల్గొనలేదు.
దీంతో దీనికి కాస్త విరామం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక, ఇప్పుడు ఈ మూవీ షూట్ బ్రేకులు లేకుండా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే న్యూస్ ఒకటి లీకైంది.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎన్నో హైలైట్లు ఉంటాయని దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే రివీల్ చేసేశాడు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో బాలకృష్ణ - కాజల్ అగర్వాల్ మధ్యన ఓ డ్యూయెట్ సాంగ్‌ను కూడా పెట్టారని తెలిసింది.

ఈ పాటను శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తున్నాడని తెలిసింది. ఇందులో ఇప్పటి వరకూ చూడని సరికొత్త స్టెప్పులతో బాలయ్య అరాచకం సృష్టించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సాంగ్ సినిమా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో వస్తుందని, ఆ సమయంలో థియేటర్లు షేక్ అయిపోవడం ఖాయం అని అంటున్నారు.
నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి కలయికలో రూపొందుతోన్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. యంగ్ సెన్సేషన్ శ్రీలీల కూతురిగా నటిస్తోన్నారు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దీన్ని దసరాకు విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.


Click it and Unblock the Notifications











