Bhagavanth Kesari: బాలయ్య ఫ్యాన్స్‌కు బిగ్ గిఫ్ట్.. ఫస్ట్ ట్రీట్‌కు డేట్ ఫిక్స్
చాలా కాలం పాటు సరైన హిట్ లేక ఇబ్బంది పడినా.. ఈ మధ్య కాలంలో మాత్రం వరుస సక్సెస్‌లను సొంతం చేసుకుంటూ ఫుల్ ఫామ్‌తో సత్తా చాటుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ ఉత్సాహంలోనే ఆయన వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ నందమూరి హీరో 'భగవంత్ కేసరి' అనే మూవీలో నటిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'భగవంత్ కేసరి' సినిమాను టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని రూపొందిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా నడుపుతున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'భగవంత్ కేసరి' మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే దాదాపు 90 శాతం వరకూ పూర్తి అయినట్లు తెలిసింది. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. ఎలాగైనా ఈ సినిమాను అనుకున్న విధంగానే దసరా బరిలో నిలిపేందుకు చిత్ర యూనిట్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది.
'భగవంత్ కేసరి' మూవీ నుంచి ఇప్పటి వరకూ కొన్ని పోస్టర్లు, టీజర్ మాత్రమే వచ్చాయి. దీంతో నందమూరి ఫ్యాన్స్ మరిన్ని అప్‌డేట్ల కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి మ్యూజిక్ ట్రీట్‌ను మొదలు పెట్టాలని టీమ్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే 'భగవంత్ కేసరి' నుంచి మొదటి పాటను విడుదల చేయబోతున్నారని తాజాగా తెలిసింది.

ఫిలిం నగర్ సమచారం ప్రకారం.. 'భగవంత్ కేసరి' మూవీలోని ఫస్ట్ సాంగ్‌ను సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేయబోతున్నారట. దీనికోసం థమన్ అదిరిపోయే ట్యూన్‌ను కంపోజ్ చేసినట్లు తెలిసింది. ఈ పాట వినాయకుడి మీద ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో బాలయ్య సినిమాలోని ఫస్ట్ సాంగ్‌పై అందరిలోనూ అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి.
ఇదిలా ఉండగా.. 'భగవంత్ కేసరి' మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల కీలక పాత్రలో నటిస్తుంది. అర్జున్ రాంపాల్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దీనికి థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.


Click it and Unblock the Notifications











