Bhagavanth Kesari: బాలయ్య నుంచి సర్‌ప్రైజ్‌లు.. అప్పటి నుంచే స్టార్ట్ చేస్తారట
వరుసగా 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ జోష్‌తోనే ఆయన మరిన్ని సినిమాలు చేసేందుకు ప్లాన్లు చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సీనియర్ హీరో 'భగవంత్ కేసరి' అనే ఫ్యామిలీ అండ్ యాక్షన్ మూవీని చేస్తున్నారు.
నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న మూవీనే 'భగవంత్ కేసరి'. పూర్తి స్థాయి కుటుంబ కథతో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇలా ఇప్పటికే దాదాపు 90 శాతం వరకూ టాకీ పార్టును చిత్ర యూనిట్ కంప్లీట్ చేసుకుంది. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు.

క్రేజీ కాంబోలో రూపొందుతోన్న 'భగవంత్ కేసరి' మూవీ నుంచి ఇప్పటి వరకూ కొన్ని పోస్టర్లతో పాటు ఓ టీజర్ మాత్రమే విడుదల అయింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ మరిన్ని అప్‌డేట్ల కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి మ్యూజిక్ ఫీస్ట్ ఎప్పటి నుంచో ఉంటుందో అన్న దానిపై ఓ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్‌ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 18వ తేదీన విడుదల చేయబోతున్నారట. దీనికోసం థమన్ అదిరిపోయే ట్యూన్‌ను కంపోజ్ చేసినట్లు తెలిసింది.
వినాయక చవితి సందర్భంగా విడుదల చేసే 'భగవంత్ కేసరి' పాట గణపతి మీద ఉంటుందని కూడా ఓ న్యూస్ లీకైంది. 'గం గం గణేషా' అంటూ ఇది సాగుతుందని అంటున్నారు. ఇక, ఈ పాట విడుదల తర్వాత నుంచి వరుసగా మిగిలిన వాటిని కూడా వదులుతారని తెలిసింది.

ఇక.. 'భగవంత్ కేసరి' మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. యంగ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే, పాల్లక్ లల్వానీ కీలక పాత్రను చేస్తోంది. అర్జున్ రాంపాల్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దీనికి థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ కాబోతుంది.


Click it and Unblock the Notifications











