Naa Kosam Song: బంగార్రాజు నుంచి బ్యూటిఫుల్ మెలోడీ.. సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా ప్రయోగాత్మక చిత్రాలు చాలానే వస్తున్నాయి. అందులో చాలా వరకు సూపర్ డూపర్ హిట్లుగా నిలవడంతో దర్శక నిర్మాతలు, హీరోలు మరింత ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. అదే సమయంలో సక్సెస్ అయిన సినిమాలకు సీక్వెల్స్, ప్రీక్వెల్స్ కూడా తెరకెక్కుతున్నాయి. ఇప్పుడిలా వస్తున్న చిత్రమే 'బంగార్రాజు'. నాలుగేళ్ల క్రితం సూపర్ డూపర్ హిట్ అయిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు ఇది ప్రీక్వెల్‌గా రూపొందుతోంది. ఇందులో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో పాటు ఆయన కుమారుడు నాగ చైతన్య కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే.

'సోగ్గాడే చిన్ని నాయన' ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్నేళ్లకు 'బంగార్రాజు' ప్రాజెక్టు బాధ్యతను నాగార్జున.. దర్శకుడు కల్యాణ్ కృష్ణకు అప్పగించాడు. అంతేకాదు, దీన్ని అక్కినేని హీరోల మల్టీస్టారర్ మూవీగా రూపొందించాలని కూడా చెప్పాడు. కానీ, స్క్రిప్ట్ సరిగా లేకపోవడం వల్లో.. మరే ఇతర కారణాల వల్లో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే దీన్ని అధికారికంగా మొదలు పెట్టేశారు. దీన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నాగార్జున ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ మొదలైన తర్వాత దీన్ని ఎంతో వేగంగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు.

Bangarraju Movie Naa Kosam Lyrical Video Released

అక్కినేని హీరోల కాంబినేషన్‌లో సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతున్న 'బంగార్రాజు' మూవీ షూటింగ్ జరుపుకుంటుండగానే ప్రమోషన్ కార్యక్రమాలను సైతం ప్రారంభించేశారు. ఇప్పటికే కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుంచి బంగార్రాజు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. తర్వాతి రోజే టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో ఊహించని విధంగా అక్కినేని నాగ చైతన్యను చూపించారు. అలాగే, ఓ పాటను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో పాటను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

బంగార్రాజు మూవీ నుంచి సాఫ్ట్ మెలోడీని వదులుతున్నామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే తాజాగా ఇందులోని 'నాకోసం మారావా నువ్వు' అంటూ సాగే ఓ అద్భుతమైన మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఈ పాటను బాలాజీ రచించారు. అలాగే, దీన్ని యంగ్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఆలపించాడు. హీరోయిన్‌ను ప్రశ్నిస్తూ హీరో ఈ పాటను పాడుకున్నట్లు క్రియేట్ చేశారు. ఇందులో చూపించిన విజువల్స్, కంపోజింగ్ అన్నీ చక్కగా కుదిరాయి. దీంతో ఈ పాట తక్కువ సమయంలోనే మంచి స్పందనను అందుకుంది.

భారీ బడ్జెట్‌తో రాబోతున్న 'బంగార్రాజు' మూవీని అక్కినేని స్టూడియోస్ బ్యానర్ సమర్పణలో జీ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. నాగ చైతన్యకు జోడీగా 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి నటిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే, ఇందులో దేవలోకంలో రంభ ఊర్వశి మేనకల పాత్రలు కూడా ఉంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీన్ని సంక్రాంతికి గానీ, జనవరి చివరి వారంలో కానీ విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X