డిస్కో కింగ్ ఈజ్ బ్యాక్.. రవితేజ్ ఎనర్జీ మామూలుగా లేదు కదా!

వరుసగా చిత్రాలు ఫ్లాప్ అవుతున్నా.. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు రవితేజ. నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని ఇలా చేసిన సినిమాలన్నీ బెడిసి కొట్టడంతో రొటీన్ కథలకు టాటా చెప్పి వీఐ ఆనంద్ లాంటి విలక్షణ దర్శకుడితో డిస్కోరాజా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, పోస్టర్స్, టీజర్స్ ఓ రేంజ్‌లో వైరల్ కాగా..తాజాగా మరో సాంగ్‌ను విడుదల చేశారు.

నువ్వు నాతో ఏమన్నావో, ఢిల్లీవాలా అనే పాటలు సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎస్పీబీ పాడిన నువ్వు నాతో ఏమన్నావో పాట యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. ఢిల్లీ వాలా సాంగ్ సైతం మంచి ఆదరణను సంపాదించుకుంది. సంక్రాంతి కానుకగారిలీజ్ చేసిన రెండో టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. తాజాగా మరో పాటను విడుదల చేసిన అందర్నీ ఆకట్టుకుంటోంది.

Bappi Lahari And Ravi Teja Sings For Disco Raja Third Single Rum Pum Bum

రమ్ పమ్ బమ్ అంటూ..
ఈ పాటను డిస్కో కింగ్ అలనాటి మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ బప్పీల హరి ఆలపించారు.ఆయనతో పాటు ఇందులో ర్యాప్‌ను రవితేజ ఎంతో ఎనర్జీతో పాడాడు. రమ్ పమ్ బమ్ అంటూ స్టైలీష్‌గా మాస్ మహారాజా పాడిన ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రాశారు. తమన్ సంగీతం అందించిన డిస్కోరాజా జనవరి 24న విడుదల కానుంది. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్,నభా నటేష్, బాబీ సింహా తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X