Bappi Lahiri తిరిగిరాని లోకాలకు డిస్కో కింగ్.. చిరంజీవి, దేవీ శ్రీ ప్రసాద్, అక్షయ్ ఎమోషనల్

బాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నది. లతా మంగేష్కర్ మరణాన్ని మరిచిపోకముందే... మరో మ్యూజిక్ లెజెండ్ బప్పీ లహిరి ఆకస్మిక మరణంతో సంగీత ప్రపంచం మూగబోయింది. బప్పీ లహరి మరణంపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బప్పీ లహిరి మృతిపై చిరంజీవి, అక్షయ్ కుమార్, కాజోల్ తదితరులు ట్విట్టర్‌లో సంతాపం వ్యక్తం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

Bappi Lahiri The Disco King | India Remembers The Music Legend | Oneindia Telugu

ప్రత్యేకమైన లుక్‌తో ఓ ట్రెండ్‌

లెజెండ్ బప్పి లహరి మరణవార్తతో విషాదంలో మునిగిపోయాను. విభిన్నమైన డిస్కో మ్యూజిక్‌తో సినీ సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. ప్రత్యేకమైన లుక్‌తో ఓ ట్రెండ్‌ను క్రియేట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్‌కు అందించిన బ్లాక్‌బస్టర్ మ్యూజిక్‌ను నేను ఎప్పటికీ మరిచిపోలేను. బప్పీ దా ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ దేవీ శ్రీ ప్రసాద్ ట్విట్టర్‌లో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

నా సినిమాలకు అద్బుతంగా.. చిరంజీవి

లెజెండరీ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి మరణ వార్తతో నేను తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాను. ఆయన నా సినిమాలకు అద్బుతమైన పాటలు అందించారు. వాటి వల్ల నా సినిమాలకు విశేషమైన పాపులారిటి లభించింది. ఆయన స్టైల్‌ను ఎప్పటికీ గుర్తుంచుకొంటారు. బప్పీ దా జీవితంలోని ఉత్సాహం ఆయన మ్యూజిక్‌లో కనిపించేది. అతడి కుటుంబానికి, స్నేహితులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సంతాపం అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

విషాద వార్తతో కలత.. యువ రాజ్ సింగ్ క్రికెటర్ యవరాజ్ సింగ్ తన సంతాపాన్ని తెలియజేస్తూ.. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి ఇకలేరనే విషాద వార్తతో కలత చెందాను. అన్ని తరాలను ఆకట్టుకొనేలా అందించిన సంగీతంతో ఆయనను ఎప్పటికీ గుర్తు పెట్టుకొంటారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేశారు.

విషాద వార్తతో కలత.. యువ రాజ్ సింగ్
క్రికెటర్ యవరాజ్ సింగ్ తన సంతాపాన్ని తెలియజేస్తూ.. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి ఇకలేరనే విషాద వార్తతో కలత చెందాను. అన్ని తరాలను ఆకట్టుకొనేలా అందించిన సంగీతంతో ఆయనను ఎప్పటికీ గుర్తు పెట్టుకొంటారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేశారు.

బప్పీ లహిరి మృతిపై మెగా హీరో

బప్పీ లహిరి మృతిపై మెగా హీరో సాయిధరమ్ తేజ్ సంతాపం వ్యక్తం చేస్తూ.. మ్యూజిక్ ప్రపంచానికి తీరని లోటు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన అందించిన పాటలతో బప్పీ లహరి చిరస్మరణీయుడు. ఆయన కుటుంబానికి, స్నేహితులు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.

డిస్కో కింగ్ ఇకలేరంటే..

బప్పీ లహిరి ఇకలేరనే వార్తతో బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ఎమోషనల్ అయ్యారు. డిస్కో కింగ్‌ను మనం కోల్పోయాం. బప్పీ దా మీరు అద్బుతమైన మ్యూజిక్ కంపోజర్, గాయకుడువి మాత్రమే కాదు. మీరు మంచి మనసు ఉన్న వ్యక్తి. మీ మనసు చాలా గొప్పది. మీ మరణంతో ఓ శకం ముగిసింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ కాజోల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఆయన దీవెనలు అందుకోవడం

సింగర్ శ్రేయా ఘోషల్ సంతాపం వ్యక్తం చేస్తూ.. మోస్ట్ ఐకానిక్ పర్సనాలిటీ. మన దేశానికి ఆయన నిజమైన రాక్‌స్టార్. నా కెరీర్‌లో ఆయన దీవెనలు అందుకోవడం నా అదృష్టంగా భావిస్తాను. ఆయన సంగీతం అందించిన సినిమాలకు నేను పాటలు పాడటం గొప్ప అదృష్టం. మీరు లోకాన్ని ఇంత త్వరగా వదలివెళ్తారని ఊహించలేదు. మీరు లేని లోటు పూడ్చలేనిది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ శ్రేయా ఘోషల్ ట్వీట్‌లో తన సంతాపాన్ని ప్రకటించింది.

మరో అణిముత్యాన్ని కోల్పోయాం.

బప్పీ లహరికి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేస్తూ.. సంగీత రంగానికి చెందిన మరో అణిముత్యాన్ని కోల్పోయాం. బప్పీ దా మీ గొంతుక నాతోపాటు ఎన్నో లక్షల మందిని డ్యాన్స్ చేయించింది. మ్యూజిక్ ద్వారా మా జీవితాల్లో సంతోషాన్ని నింపినందుకు ధన్యవాదాలు. ఈ విషాద సమయంలో మీ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి అంటూ అక్షయ్ కుమార్ తన ట్వీట్‌లో తెలిపారు.

డిస్కో మ్యూజిక్‌‌తో

ప్రముఖ నటి హేమా మాలిని తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. బప్పీ లహిరి లేదా బప్పీ దా అని ముద్దుగా పిలుచుకొనే వాళ్లం. అలాంటి వ్యక్తి మంగళవారం అర్ధరాత్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. సినిమాల ద్వారా డిస్కో మ్యూజిక్‌ను, పాటలను అందించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అంతకుముందు ఇలాంటి విభిన్నమైన సంగీతాన్ని ఎవరూ అందించలేదు. ఆయన మరణం అభిమానులకు తీరని లోటు అని హేమా మాలిని ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X